Social Media Influencers: ఏపీలో ప్రభుత్వ ప్రచారానికి సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్లకు మధ్య నగదు చెల్లింపుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది..! కూటమి సర్కార్‌లో కార్యకర్తల కోసమే ప్రజల డబ్బు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి..! రాజమండ్రిలో జరిగిన పర్యాటక దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం అనుకుంటున్న సోషల్ మీడియా బూస్టప్ ఆరంభంలోనే బెడిసి కొట్టిందా..!
Kakinada Uppada Beach: కనుమరుగైపోతున్న గ్రామం.. గంగమ్మ గర్భంలో కలసిపోతున్న ఇళ్లు! కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ప్రసిద్ధ తీరప్రాంతం ఉప్పాడ. జాందానీ చీరలు, ఉప్పాడ పట్టు, కమ్మని ఎండుచేపలకు పేరొందిన ఈ గ్రామం. ప్రస్తుతం భౌతికంగా కనుమరుగైపోయే ప్రమాదంలో పడింది. సముద్రపు రాకాసి అలల ధాటికి ఇప్పటికే కిలోమీటర్ల కొద్దీ నీట మునిగిన ఉప్పడ గ్రామంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ న్యూస్..!
Kakinada Latest News: కాకినాడ సముద్ర తీరంలో కొందరి అత్యాశ...వేలాది మంది మత్స్యకారుల పొట్టకొడుతోంది! అక్రమ వేట సముద్ర గర్భాన్ని గుల్ల చేస్తోంది! నియంత్రించాల్సిన అధికారుల నిర్లక్ష్యం సాంప్రదాయ మత్స్యకారుల బతుకులను బుగ్గి పాలు చేస్తోంది! హోప్ ఐలాండ్, కోరింగ అభయారణ్య పరిధిలో సాగుతున్న ఈ జల దోపిడీపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
NATS Service Programs: దివ్యాంగులు, నిరాశ్రయుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) మరోసారి ముందుకొచ్చింది. సంబరంలో సేవ నినాదంతో సమకూర్చిన రూ.80 లక్షల భారీ నిధులతో తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులు, అనాథల సమగ్ర పునరావాసానికి విస్తృత సహాయక కార్యక్రమాలను చేపట్టింది.
School Holiday For Today On 25th September: ఏపీలో స్కూళ్ల సెలవులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రెండు రోజులు సెలవు ప్రకటించగా.. రేపు కూడా పలు జిల్లాల్లో సెలవు ప్రకటించారు. శుక్రవారం పాఠశాలలకు సెలవు ఇస్తూ స్థానిక అధికార యంత్రాంగం ప్రకటించింది.
Uttarandhra High Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడింది. అది తీరం వైపు దూసుకువస్తోంది. ఇవాళ రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఇది తీవ్ర వాయుగుండంగానే తీరం దాటే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది.
AP Politics: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేతో టీడీపీ కార్యకర్తల రగడ హాట్ టాపిక్ గా మారింది. తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన మహిళా ఎమ్మెల్యే తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇంతకీ అక్కడ ఎమ్మెల్యేపై టీడీపీ క్యాడర్ ఎందుకు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే సారీ చెప్పడంతో అసమ్మతి కథ సుఖాంతం అయినట్టేనా...? నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై టిడిపి అధిష్టానం ఏం చేయబోతుంది...?
Gorantla Butchaiah Chowdary: వైసీపీతో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో రగడకు దిగారు..! పేరడీ కవితలు... సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు..! అయితే వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలు సైతం ధీటుగా బదులు ఇస్తున్నారు..! ఇంతకీ ఆ రచ్చ ఏంటి...? మంత్రి పదవి కోసమే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల ఆ రూట్ లో వెళ్తున్నారా..! లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!
విశాఖపట్నం గాజువాకలోని వినాయక మండపం వద్ద పోలీసుల చర్యలు ఉద్రిక్తంగా మారాయి. గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ, SV ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్య కంకణ మహాగణపతి ఉత్సవాల్లో ప్రభుత్వ అధికారులు, నిర్వాహకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక్కడ భారీ గణపతి విగ్రహంతో పాటు, 21 కమర్షియల్ స్టాళ్లు, యమలోకం సెట్‌ను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉత్సవ ప్రాంగణంలో ఉన్న మొత్తం పరిస్థితిని వారు పరిశీలించారు.