• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Tomorrow School Holiday: రేపు ఏపీలో అన్నీ స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు.. ఎక్కడెక్కడ అంటే?

Tomorrow School Holiday: రేపు ఏపీలో అన్నీ స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు.. ఎక్కడెక్కడ అంటే?

Tomorrow Schools Holiday And Colleges Also In 9 Districts: రేపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో దాని ప్రభావంతో భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలోని పలు జిల్లాల్లో అన్నీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇచ్చారు. ఎక్కడెక్కడో తెలుసా?

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 23, 2026, 10:47 PM IST|Updated: Sep 23, 2026, 10:58 PM IST
joinshare
Tomorrow School Holiday: రేపు ఏపీలో అన్నీ స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు.. ఎక్కడెక్కడ అంటే?
Image Credit: Zee Telugu News YouTube

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tomorrow Schools And Colleges Holiday: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన రావడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఈ సందర్భంగా వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా.. వాతావరణ శాఖ సూచనల మేరకు ఆయా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇంతకీ ఏయే జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారో తెలుసుకుందాం.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏర్పడగా బుధవారం రాత్రి తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటగా దాని ప్రభావం తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లరాదని సూచించారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని.. ఇంట్లోనే ఉండాలని సూచనలు చేశారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై వర్ష ప్రభావిత జిల్లాల్లో సెలవులు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 24వ తేదీ పలు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు పది జిల్లాల్లో స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని విద్యా శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లాలు ఏవేవి అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీ పురం (మన్యం ), ఏలూరు, కాకినాడ జిల్లాలు ఉన్నాయి.

కాకినాడ జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటుకళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు 24 వ తేదీ  గురువారం ఒకరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అన్నీ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఆ జిల్లా విద్యా శాఖ అధికారి ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

అధికార యంత్రాంగం అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం భయాందోళన రేపుతోంది. గడిచిన 6 గంటల్లో 13 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదిలింది. వజ్రపుకొత్తూరు -భోగాపురం మధ్య తీరం దాటిందని తెలుస్తోంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు.. అకస్మాత్తుగా వరదలు సంభవించే అవకాశం ఉండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సహాయ చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచింది. ఇక శ్రీకాకుళం, అల్లూరి, అనకాపల్లి, విశాఖలో 5 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు చేసింది.

సెలవు ఈ జిల్లాల్లో..
తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి
పోలవరం
విశాఖపట్నం
అనకాపల్లి
అల్లూరి సీతారామరాజు
పార్వతీ పురం (మన్యం )
ఏలూరు
కాకినాడ

Add Zee News as a Preferred Source
TAGS:
School Holiday