Tomorrow School Holiday: రేపు ఏపీలో అన్నీ స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు.. ఎక్కడెక్కడ అంటే?
Tomorrow Schools Holiday And Colleges Also In 9 Districts: రేపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో దాని ప్రభావంతో భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలోని పలు జిల్లాల్లో అన్నీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇచ్చారు. ఎక్కడెక్కడో తెలుసా?
Tomorrow Schools And Colleges Holiday: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన రావడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఈ సందర్భంగా వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా.. వాతావరణ శాఖ సూచనల మేరకు ఆయా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇంతకీ ఏయే జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారో తెలుసుకుందాం.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏర్పడగా బుధవారం రాత్రి తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటగా దాని ప్రభావం తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లరాదని సూచించారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని.. ఇంట్లోనే ఉండాలని సూచనలు చేశారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై వర్ష ప్రభావిత జిల్లాల్లో సెలవులు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 24వ తేదీ పలు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు పది జిల్లాల్లో స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని విద్యా శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లాలు ఏవేవి అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీ పురం (మన్యం ), ఏలూరు, కాకినాడ జిల్లాలు ఉన్నాయి.
కాకినాడ జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటుకళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు 24 వ తేదీ గురువారం ఒకరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అన్నీ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఆ జిల్లా విద్యా శాఖ అధికారి ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం భయాందోళన రేపుతోంది. గడిచిన 6 గంటల్లో 13 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదిలింది. వజ్రపుకొత్తూరు -భోగాపురం మధ్య తీరం దాటిందని తెలుస్తోంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు.. అకస్మాత్తుగా వరదలు సంభవించే అవకాశం ఉండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సహాయ చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచింది. ఇక శ్రీకాకుళం, అల్లూరి, అనకాపల్లి, విశాఖలో 5 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు చేసింది.
సెలవు ఈ జిల్లాల్లో..
తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి
పోలవరం
విశాఖపట్నం
అనకాపల్లి
అల్లూరి సీతారామరాజు
పార్వతీ పురం (మన్యం )
ఏలూరు
కాకినాడ