Ttd good news to Tirumala pilgrims: కలియుగ ప్రత్యక్షదైవం భక్తుల కొంగు బంగారం తిరుమలలో శ్రీవారి దర్శనాలకు భక్తు రద్దీ కొనసాగుతుంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ పకట్బంది చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సామాన్య భక్తుల దర్శనాలే ప్రయారిటీగా వీఐపీ దర్శనాలు, ఎస్ ఎస్ డీ, దివ్యదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. ఈ క్రమంలో భక్తులు ఎంత భారీగా తరలి వస్తున్న టీటీడీ సులభంగా దర్శనాలు కల్పిస్తుంది. బ్రహ్మోత్సవాల వేళ అటు మూలమూర్తులు, ఇటు ఉత్సవ మూర్తులను దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో భక్తుల గోవింద నామస్మరణలతో తిరుగిరులు మార్మోగుతున్నాయి.
నిన్న శ్రీవారి తల నీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,581 గా ఉంది. శ్రీవారి హుండీఆదాయం : 2.46 కోట్లు కాగా, లడ్డూ విక్రయం... 3.69 లక్షలు, అన్నప్రసాదం.. 1.84 లక్షలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ప్రస్తుతం వెయిటింగ్ కేవలం 4 కంపార్ట్‌మెంట్‌లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.ఈ క్రమంలో సుమారు సర్వదర్శనం కోసం దర్శన్ సమయం (SSD టోకెన్‌లు లేకుండా).. భక్తులకు కేవలం 4 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.
టీటీడీ ఏర్పాట్ల పట్ల భక్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న శ్రీవారిని 71,196 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలను వీరిలో 22,581 సమర్పించారు. ఈ క్రమంలో భక్తుల కానుకలతో హుండీ ఆదాయం రూ.2.46 కోట్లు సమకూరింది. ఇక తిరుమలలో ఇటీవల రూ.104 కోట్లతో ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియం ప్రారంభించారు.
భక్తుల సౌకర్యార్థం 32 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
అంతే కాకుండా.. తిరుమల వచ్చే ప్రతి భక్తుడికి రూ.2 లక్షల బీమా సౌకర్యం కూడా కల్పించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని టీటీడీ వెల్లడించింది. దీనికోసం.. మారిషస్, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి కూడా ఆలయ నిర్మాణానికి విజ్ఞప్తులు వస్తున్నాయని టీటీడీ పేర్కొంది.