• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Tirumala: తిరుమల లడ్డు వివాదం వేళ టీటీడీ కీలక నిర్ణయం.. ఏకంగా 12 టన్నుల జీడిపప్పు రిజెక్ట్.. అసలు కారణం ఇదే..

Tirumala: తిరుమల లడ్డు వివాదం వేళ టీటీడీ కీలక నిర్ణయం.. ఏకంగా 12 టన్నుల జీడిపప్పు రిజెక్ట్.. అసలు కారణం ఇదే..

TTd rejects 12 tonnes cashewnuts: తిరుమల లడ్డు‌ ప్రసాదాలు, స్వామి నైవేద్యం ప్రసాదాల కోసం వచ్చిన నాణ్యత లేని జీడిపప్పుని టీటీడీ వెనక్కి పంపింది. అంతే కాకుండా.. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ముడి సరుకులను మాత్రమే వినియోగించాలని అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 04, 2026, 04:35 PM IST|Updated: Oct 04, 2026, 04:41 PM IST
joinshare
Tirumala: తిరుమల లడ్డు వివాదం వేళ టీటీడీ కీలక నిర్ణయం.. ఏకంగా 12 టన్నుల జీడిపప్పు రిజెక్ట్.. అసలు కారణం ఇదే..
Image Credit: tirumala(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Manchu Manoj: భార్య మౌనిక పుట్టినరోజున ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!

Manchu Manoj: భార్య మౌనిక పుట్టినరోజున ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!

2

Kollam Anju Case: అశ్లీల వెబ్‌సైట్‌లో శోభనం వీడియోలు..నవ వధువును ఘోరంగా టార్చర్ చేస్తున్న వరుడు!

3

ఆధార్, పాన్ కార్డ్‌లో అడ్రస్ మార్చాలా? నిమిషాల్లో ఇంట్లోనే ఇలా మార్చుకోండి!

4

పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. రోజుకు రూ.300 దాచిపెడితే చేతికి రూ.6.42 లక్షలు! పూర్తి క్యాలిక్యులేషన్!

5

New Job Card: 15 రోజుల్లోనే కొత్త జాబ్ కార్డు.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ttd Rejects 12 tonnes cashew nuts quality supply: తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఇంకా రచ్చ కొనసాగుతుంది. ఈ క్రమంలో గతంలో లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని పెను దుమారం చెలరేగింది. ఆ తర్వాత దీనిలో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. అయితే.. తాజాగా.. టీటీడీ మాత్రం తిరుమల లడ్డు, శ్రీవారి నైవేద్యాలకు తయారీకి ఉపయోగించే పదార్థాలలో ఎక్కడ కూడా రాజీపడబోమని ప్రకటించారు. 

అంతే కాకుండా దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్పష్టమైన నిబంధనలను పాటిస్తున్నట్లు తెలిపారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన సహకార కార్పొరేషన్‌(జీసీసీ) నుంచి సేకరించిన సుమారు 12 టన్నుల జీడిపప్పును వెనక్కి పంపించినట్లు టీటీడీ వెల్లడించింది. లడ్డు ప్రసాదం, నైవేద్యాల కోసం ఉపయోగించే ముడిపదార్థాల వాటిలో నాణ్యత లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. అదే విధంగా కాంట్రక్టర్ లపై చర్యలకు సైతం వెనుకాడబోమని టీటీడీ తెలిపింది.   

టీటీడీలోని శ్రీవారి ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాల కోసం అనేక ముడిసరుకుల కోసం టీటీడీ అధికారులు నిత్యం టెండర్లు పిలుస్తుంటారు. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ముడి సరుకులను మాత్రమే వినియోగించాలని  అధికారుల నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ప్రస్తుతం సరఫరా జరిగిన జీడిపప్పులో ముందుగా నాణ్యత పరీక్షలు జరగకుండానే జీడిపప్పు సరఫరా చేశారనే విమర్శలు వస్తున్నాయి.


పార్వతీపురం నుంచి వచ్చిన 12 టన్నుల జీడిపప్పును నిన్న తిరుమల TTD గోడౌన్‌కు  తరలించారు. ఆ తర్వాత దానికి నాణ్యత పరీక్షలు నిర్వహించగా.. పరీక్షల్లో TTD నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు లేనట్లు గుర్తించారు. 

దీంతో 12 టన్నుల జీడిపప్పును పూర్తిగా రిజెక్ట్ చేసి అధికారులు వెనక్కి పంపించారు. ముడిసరుకుల నాణ్యత విషయంలో రాజీ పడేది టీటీడీ తెల్చి చెప్పింది.  దీనిపై మరింత లోతుగా విజిలెన్స్ దర్యాప్తుకు సైతం టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirupathi
Tirumala
TTD News