SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala: భక్తులకు బంపర్ శుభవార్త.. రేపు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. పూర్తి వివరాలు..

Ttd navaratri brahmotsavam ticket update: అక్టోబ‌ర్ 11 నుంచి 20వ తేది వ‌ర‌కు తిరుమ‌ల‌లో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలపై టీటీడీ పకట్బంది చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భ‌క్తుల అధిక ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప‌ది రోజుల పాటు ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మిన‌హా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Written By Inamdar Paresh
Published: Oct 06, 2026, 04:38 PM IST | Updated: Oct 06, 2026, 04:47 PM IST
Image Credit: tirumala(file)
Join

Ttd key update on Tirumala navaratri brahmotsavam darshan tickets: కలియుగ దైవం, భక్తుల కొంగుబంగారమైన  తిరుమలలో ఇటీవల సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదే విధంగా ప్రస్తుతం అశ్వయుజ మాసం నవరాత్రిలో జరిగే తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సైతం టీటీడీ పకట్బంది చర్యలు చేపట్టింది.  

ఈ ఏడాది నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి.  అయితే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 7న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అదే విధంగా.. అక్టోబ‌ర్ 11 నుంచి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7వ తేది ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ క్రమంలో భక్తులు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

అక్టోబ‌ర్ 11 నుంచి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప‌ది రోజుల పాటు ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మిన‌హా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేయ‌డం జ‌రిగిందని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దీనిలో భాగంగా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు సంబంధించి అక్టోబ‌ర్ 10వ తేది నుండి 19వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని భ‌క్తులు త‌మ తిరుమ‌ల యాత్ర‌ను ప్లాన్ చేసుకొవాలని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES