Vijay sai reddy responds on ys jagan Sharmila property dispute: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల పరివర్తన రాజనీతి పార్టీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఏపీలో రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. తమ పార్టీ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయమని ఇప్పటికే ప్రకటించారు. తాము ఎవరికి బీ టీమ్ కాదని విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాజాగా.. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చ ఏడాది ఉగాది తర్వాత ఏపీలో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. అంతే కాకుండా ప్రజలతో మమేమం అయి వారి సమస్యలు వింటామన్నారు. ఏపీలో రెండు పార్టీలకు తమ పార్టీ ప్రత్యామ్నాయమన్నారు. తమ పార్టీలో యువతకు, మహిళలకు పెద్ద పీట వేస్తామన్నారు. జెన్ జీలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తాను బాల్ థాక్రేలాంటి మాదిరి రాజకీయ సలహాదారుడిగా ఉంటానని చెప్పుకొచ్చారు.
జగన్ - షర్మిల ఆస్తుల వివాదం గురించి నేను మాట్లాడలేను వారే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇస్తా - విజయసాయి రెడ్డి https://t.co/WeKlEZlwn6
— greatandhra (@greatandhranews) November 25, 2026
సీఎం అభ్యర్థిని మాత్రంతాను కాదని స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాల వారికి అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. పాదయాత్రలో గ్రామల్లో తిరుగుతూ అందరి సమస్యల్ని వింటామన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి జగన్ సీఎం పదవి కావాలని డిమాండ్ చేశారన్నారు. వారు అంగీకరించక పోవడంతో వెన్నుపోటుపొడిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం చాలా కష్టపడ్డానని చెప్పారు. తనను పార్టీనుంచి వెళ్లేలా అనేక అవమానాలు చేశారన్నారు.బీజేపీ, వైసీపీ మధ్య అనుసంధాన కర్తగా ఉన్న నన్ను తప్పించారన్నారు. జగన్ కు ఇదంతా తెలిసే జరిగిందన్నారు. వైఎస్ కుటుంబ వ్యవహరం నాకు, కేవీపీకి మాత్రమే ఎక్కువగా తెలుసన్నారు. అన్ని విషయాల్ని బైటపెట్టడం సమంజసం కాదన్నారు. జగన్, షర్మిల ఆస్తుల వ్యవహరం వారి వ్యక్తిగత విషయమన్నారు. తమ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం దక్కేలా చేయడమే తమ పరివర్తన రాజనీతి పార్టీ ధ్యేయమని విజయసాయి రెడ్డి తెల్చి చెప్పారు. మరోవైపు విజయసాయి రెడ్డి కొత్త పార్టీని వైఎస్ జగన్ కు బీ పార్టీ అని కొంత మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. మరికొంత మంది సీఎం చంద్రబాబు కనుసన్నల్లో విజయసాయి రెడ్డి పార్టీ పనిచేస్తుందని రూమర్స్ వైరల్ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం మూడు పార్టీల మధ్య రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.