SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బంగారు వాకిలి నుంచి దుర్గమ్మ దర్శనం.. ఏపీ ప్రభుత్వ వాట్సాప్ నంబర్‌తో 2 నిమిషాల్లో టికెట్! ధర ఎంతంటే?

దుర్గమ్మ భక్తులకు శుభవార్త! నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, అమ్మవారి ప్రత్యేక దివ్యదర్శనం టికెట్లను ఈరోజు నుంచి విడుదల చేస్తున్నారు. ఆలయం ప్రతిరోజూ 1000 మందికి ఈ టికెట్లను జారీ చేయనుంది. వీటిని ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చు, ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 09, 2026, 09:34 AM IST | Updated: Oct 09, 2026, 09:44 AM IST
Image Credit: Vijayawada Kanaka Durga Bangaru Vakili Darshan: Image credits kanakadurga temple
Join

Vijayawada Kanaka Durga Bangaru Vakili Darshan: విజయవాడలో శరన్నవరాత్రులు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమై, 20వ తేదీ వరకు అత్యంత విశేషంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి తొమ్మిది అవతారాలను పూజిస్తారు. ఈ పవిత్ర దినాల్లో అమ్మవారి ఆశీస్సులు పొందాలని చాలా మంది భక్తులు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి రికమండేషన్లు లేకుండా సామాన్య భక్తులు కూడా నేరుగా బంగారు వాకిలి నుంచి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ నెంబర్‌ ద్వారా కేవలం 2 నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి విడతలవారీగా ఆన్‌లైన్‌లో టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. ప్రతిరోజూ కేవలం 1000 మందికి మాత్రమే టికెట్లు జారీ చేస్తున్నారు కాబట్టి, భక్తులు ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. ఈ దివ్య దర్శన టికెట్ల గురించి ఈఓ వికె శీనా నాయక్ వెల్లడించారు. ప్రధానంగా సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తూ ప్రతిరోజూ వెయ్యి టికెట్లను విడుదల చేస్తున్నారు.

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక దర్శన టికెట్ ధరను రూ.1000 గా నిర్ణయించారు. టికెట్లు పొందిన భక్తుల కోసం కమ్మరిపాలెం సెంటర్లోని టీటీడీ స్థలం నుంచి కొండపైకి వెళ్లడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారు. ప్రత్యేక క్యూ లైన్ ద్వారా భక్తులను బంగారు వాకిలికి అనుమతిస్తారు, దీనివల్ల ముఖ మంటపం నుంచి అత్యంత సమీపంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ టికెట్లు ఉన్నవారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జగన్మాత దివ్యదర్శనాన్ని పొందవచ్చు.

దసరా మహోత్సవాల్లో కనకదుర్గ అమ్మవారి దివ్య అలంకారాలు..
అక్టోబర్‌ 11వ తేదీ ఆదివారం పాడ్యమి- శ్రీ బాల త్రిపుర సుందరీదేవి
అక్టోబర్‌ 12న సోమవారం విదియ- శ్రీ గాయత్రీ దేవి
అక్టోబర్‌ 13న మంగళవారం తదియ- అన్నపూర్ణదేవి
అక్టోబర్‌ 14 బుధవారం చవితి తిథి- శ్రీ మహాచండి
అక్టోబర్‌ 15 గురువారం పంచమి- లలిత త్రిపుర సుందరీ దేవి
అక్టోబర్‌ 16 శుక్రవారం షష్ఠి -సరస్వతి దేవి
అక్టోబర్‌ 17 శనివారం సప్తమి- శ్రీ మహాలక్ష్మీ దేవి
అక్టోబర్‌ 18 ఆదివారం అష్టమి- దుర్గాదేవి
అక్టోబర్‌ 19 సోమవారం నవమి- మహిషాసుర మర్ధిని
అక్టోబర్ 20వ తేదీ మంగళవారం దశమి- శ్రీ రాజరాజేశ్వరి దేవి (విజయ దశమి)

విజయవాడ దుర్గమ్మ ప్రత్యేక దర్శనాలు చేసుకునే భక్తులు ఆలయ అధికారిక వెబ్‌సైట్‌ https://kanakadurgamma.org/ లో చెక్‌ చేసుకుని కూడా బుక్‌ చేసుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES