Vijayawada: మూల నక్షత్రం వేళ భక్తులకు శుభవార్త.. ఇంద్రకీలాద్రిపై రేపు వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు.!.
Moola nakshatram puja in indra keeladri: ఇంద్రకీలాద్రిలో భక్తులు పొటెత్తారు. దేవీ నవరాత్రుళ వేళ వేలాదిగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈక్రమంలో మూల నక్షత్రం నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మ ఆలయకమిటీ సిబ్బంది కీలకనిర్ణయం తీసుకున్నారు.
Vip protocol darshan cancelled in Vijayawada Durga Temple: ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలోని కనక దుర్గమ్మ సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా.. ఇతరరాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దుర్గమ్మ దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో నవరాత్రుల్లో ఆరో రోజున దుర్గమ్మవారు సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
రేపు శుక్రవారం రోజున మూల నక్షత్రం కూడా కలసి రావడం అత్యంత విశేషమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఆలయ కమిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రోజు అన్నిరకాల వీఐపీ ప్రొటొకాల్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంను భక్తుల గమనించాలని దుర్గమ్మ గుడి అధికారులు సూచించారు.
అదే విధంగా రేపు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు సైతం విజయవాడకు చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, మొక్కులు తీర్చుకుంటారు. ఈక్రమంలో ప్రత్యేంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. సామాన్య భక్తులకు సమస్యలు తలెత్తకుండా దుర్గగుడి ఆలయ అధికారులు పకట్బంది చర్యలు తీసుకున్నారు.
ఇక విజయవాడలో దుర్గమ్మ తల్లి ఈ రోజున లలితా త్రిపుర సుందరీదేవి అలంకారణలో అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. క్యూలైన్ లలో వేచిఉన్న భక్తులకు మంచి నీరు, మజ్జిగ, టిఫిన్ లు, బిస్కట్ లు మొదలైన వాటిని పంపిణి చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు.