SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Wine Shops Close: మందుబాబులకు భారీ షాక్‌.. ఏపీలో మూడు రోజులు వైన్స్‌ బంద్‌!

Wine Shops 3 Days Close From October 30th To November 1st In AP: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ఇది చేదు వార్త. ఏకంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. నేటి సాయంత్రం నుంచి మూడు రోజుల దాకా వైన్స్‌ మూసివేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 30, 2026, 11:33 AM IST | Updated: Oct 30, 2026, 12:01 PM IST
Image Credit: Wine Shops Close In AP
Join

Tomorrow Wine Shops Close: మద్యంప్రియులు.. మందుబాబులకు ఇది భారీ షాక్‌ ఇచ్చే వార్త. ఏకంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. ఒక్క వైన్‌ షాపులే కాకుండా బార్లు కూడా మూతపడనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నేటి సాయంత్రం నుంచి నవంబర్‌ 1వ తేదీ సాయంత్రం వరకు వైన్స్‌, బార్లు మూతపడనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానుండగా.. తిరిగి నవంబర్ 1వ తేదీ సాయంత్రం బార్లు, వైన్స్‌ తెరచుకుంటాయి. ఇక మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడే నవంబర్ 3వ తేదీ కౌంటింగ్ రోజున కూడా మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరగనుండగా.. ఈ ఆదేశాలు ఆ ప్రాంతాల్లో అమలు కానున్నాయి. ఈ రోజుల్లో పూర్తిగా మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా.. గొడవలు జరగకుండా ఉండేందుకు మద్యం, బార్లు మూసివేయడం సాధారణ ప్రక్రియ. శాంతిభద్రతలు కాపాడేందుకు.. అంతేకాకుండా ఎన్నికల్లో మద్యం ప్రలోభాలు గురిచేయకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మద్యం, బార్లు మూసివేస్తున్నారు. ఈ మూడు రోజులు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించాలని ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది. బ్లాక్‌లో విక్రయాలు చేసినా.. భారీగా మద్యం నిల్వలు ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్‌ శాఖ హెచ్చరించింది.

నవంబర్ 1వ తేదీన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పోలింగ్‌ జరగనుండగా దీనికి పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నికల సంఘం నిబంధనలు తప్పక అమలయ్యేలా పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. పోలింగ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో పోలీసు బందోబస్తుతోపాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియో గ్రాఫర్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎన్నికల సంఘం మరింత కట్టుదిట్టమైన భద్రతతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES