SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

YS Jagan: గట్టిగా నిలబడ్డావ్.. అండగా ఉంటాం.. రాప్తాడులో గాయపడ్డ లక్ష్మికి ఫోన్ చేసిన వైఎస్ జగన్..

YS Jagan: రాప్తాడులో ఉన్మాది హేమంత్ గోపికపై దాడి చేస్తుండగా లక్ష్మి అనే ఆమె స్నేహితులురాలు క్లాసులో అతడ్ని నిలువరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ ను బాధిత బాలికను పరామర్శించారు.

Written By Inamdar Paresh
Published: Nov 03, 2026, 08:42 PM IST | Updated: Nov 03, 2026, 08:52 PM IST
Image Credit: ys jagan (file)
Join

YS Jagan phone call to raptadu brave girl: ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో అక్టోబరు 31న ఉన్మాది బాలిక గోపికపై రంపంతో స్కూల్ లోనే దాడికి తెగపడ్డాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయాలపాలైంది. మరోవైపు గోపికపై దాడి చేసేటప్పడు లక్ష్మి అనే ఆమె స్నేహితురాలు హేమంత్ ను నిలువరించింది. దీంతో ఆమెపై కూడా హేమంత్ దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన గోపికను స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అంతే కాకుండా  ప్రస్తుతం బాలిక పూర్తిగా ప్రాణాపాయం నుంచి బైటపడినట్లు వైద్యులు తెలిపారు. 

మరోవైపు బాలిక స్నేహితురాలు లక్ష్మి సైతం స్థానికంగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పేరును ఇటీవల ఏపీ ప్రభుత్వం  నేషనల్ బ్రేవరి అవార్డుకు సిఫారసు చేసింది. అయితే మాజీ సీఎం జగన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మికి ఫోన్ కాల్ లో పరామర్శించారు.

 ఫ్రెండ్ కోసం గట్టిగా నిలబడ్డావ్ తల్లి.. నీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామంటూ భరోసా ఇచ్చారు. అంతే కాకుండా బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి కావాలిస్తే ప్రైవేటు ఆస్పత్రికి షిప్ట్ చేయాలన్నారు. లక్ష్మి జగన్ తో మాట్లాడుతూ.. తన స్నేహితురాలు గోపిక హెల్త్ ఎలా ఉందని అడిగింది. దీనికి జగన్ ప్రస్తుతం ప్రాణపాయం తప్పిందని వైద్యులు చెప్పినట్లు  చెప్పారు. తొందరగా కొలుకొవాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ బాధిత బాలికకు తన భరోసా ఇచ్చారు. 

నిందితుడు హేమంత్ కుడికాలును తొలగించినట్లు వైద్యులు తెలిపారు. అరెస్ట్ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాళ్లలో బుల్లెట్లు దూసుకొని పొవడం వల్ల శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. హేమంత్ ను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES