• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Cyberabad Police: మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు.. అసలు విషయం ఇదే..

Cyberabad Police: మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు.. అసలు విషయం ఇదే..

Cyberabad police to it companies: రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 03, 2026, 09:09 PM IST|Updated: Nov 03, 2026, 09:25 PM IST
joinshare
Cyberabad Police: మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు.. అసలు విషయం ఇదే..
Image Credit: Hyderabadnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజ్‌ కుప్పకూలలేదు.. కాంగ్రెస్‌ అబద్దాల ప్రచారం

Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజ్‌ కుప్పకూలలేదు.. కాంగ్రెస్‌ అబద్దాల ప్రచారం

2

Cyberabad Police: మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు.. అసలు విషయం ఇదే..

3

YS Jagan: గట్టిగా నిలబడ్డావ్.. అండగా ఉంటాం.. రాప్తాడులో గాయపడ్డ లక్ష్మికి ఫోన్ చేసిన వైఎస్ జగన్..

4

YS Jagan Tweet: ఇవి ఎలక్షన్స్ కావు.. పక్కా సెలక్షన్స్.. కూటమి విజయంపై వైఎస్ జగన్ సంచలన ట్విట్..

5

Pawan Kalyan: వర్షాలు పూర్తిగా తగ్గే వరకు సిబ్బందికి సెలవులు రద్దు.. మురసు తుపాన్ పై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cyberabad police advice to early logout and work from home: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మురసు తుపాన్ ప్రభావం కన్పిస్తుంది. మురసు ప్రభావంతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం వర్షాలతో అప్రమత్తమైంది. ఇక దీని ప్రభావం వల్ల తెలంగాణలోని కొన్ని జిల్లాలు ప్రభావితం అవుతున్నాయి. ఇక రాబోయే మూడు రోజులు పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుందని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షాల అలర్ట్ నేపథ్యంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

దీనిలో భాగంగా ఐటీ కంపెనీలకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌లో  నవంబరు 3 నుంచి 5  వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు  మధ్యాహ్నం 2 గంటల నుంచే దశలవారీగా 4 గంటల లోపు ఎర్లీ లాగ్‌అవుట్ సౌకర్యం కల్పించాలని కోరారు. అదే విధంగా, వీలైతే ఆయ కంపెనీలు మూడు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలని  ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు.

వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ ఇబ్బందులు పెరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమ సంస్థల లొకేషన్, ఎర్లీ లాగౌట్ సమయాల వివరాలను cybtrcc@gmail.comకు ఈమెయిల్ ద్వారా పంపించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని సూచించారు. మ్యాన్ హోళ్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రోడ్డుపై కరెంట్ వయర్ లు పడితే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ట్రాఫిక్ నియమాల్ని తప్పకుండా పాటించాలని అలర్ట్ జారీ చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Rain News
Telugu News