• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /YS Sharmila Vs YS Jagan: మరోసారి తెరపైకి ఆస్తుల పంచాయితీ..షర్మిల తన ప్యాలెస్‌లో అడుగుపెట్టకూడదని కోర్టుకు జగన్!

YS Sharmila Vs YS Jagan: మరోసారి తెరపైకి ఆస్తుల పంచాయితీ..షర్మిల తన ప్యాలెస్‌లో అడుగుపెట్టకూడదని కోర్టుకు జగన్!

YS Jagan Vs Sharmila Yelahanka Palace: బెంగళూరులోని యలహంక నివాసం విషయంలో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. షర్మిల ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా నిరోధించాలని కోరుతూ దేవనహళ్లి కోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సమాచారం. ఆస్తి యాజమాన్యం, షర్మిల బెంగళూరు పర్యటన, కుమార్తె వివాహ ఆహ్వానం నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Written ByHarish Darla
Published: Nov 21, 2026, 17:44 IST|Updated: Nov 21, 2026, 17:46 IST
joinshare
YS Sharmila Vs YS Jagan: మరోసారి తెరపైకి ఆస్తుల పంచాయితీ..షర్మిల తన ప్యాలెస్‌లో అడుగుపెట్టకూడదని కోర్టుకు జగన్!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Jagan Vs Sharmila Yelahanka Palace: వైఎస్ కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. బెంగళూరులోని యలహంక నివాసానికి సంబంధించి వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య విభేదాలు మరో మలుపు తిరిగినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. షర్మిల ఆ నివాసంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని కోరుతూ బెంగళూరులోని దేవనహళ్లి కోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సమాచారం.

ఈ పిటిషన్ 'సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్' పేరుతో దాఖలైనట్లు తెలుస్తోంది. భీమిశెట్టి రమేశ్ బాబు ఈ ప్రక్రియలో పిటిషనర్‌గా అందులో పేర్కొన్నారు. యలహంక ప్యాలెస్ విషయంలో గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదం నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని ఈ నివాసంలో నిర్వహించాలని భావించగా, భద్రతా కారణాలతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనం చెబుతోంది. దీంతో వివాహ వేడుకకు సంబంధించిన ప్రణాళికల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం.

తాజాగా షర్మిల తన కుమార్తె వివాహానికి జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్నట్లు ప్రచారం జరగడంతో ఈ వివాదం మళ్లీ చర్చకు వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యలహంక నివాసంలో బస చేయాలనే ఆలోచన ఉందన్న వార్తల నేపథ్యంలో జగన్ వర్గం న్యాయపరమైన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

యలహంక నివాసం తన అత్తగారు సుగుణమ్మకు చెందినదని, షర్మిలకు ఆస్తిపై హక్కులు లేవని జగన్ వాదిస్తున్నట్లు ఆ పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో నేరుగా భద్రతా సిబ్బంది ద్వారా ప్రవేశాన్ని అడ్డుకోవడం వల్ల వివాదం పెరిగే అవకాశం ఉందని భావించి, కోర్టు ద్వారా ఇంజంక్షన్ పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ పిటిషన్‌తో వైఎస్ కుటుంబంలోని ఆస్తి వివాదం మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. దేవనహళ్లి కోర్టు ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? షర్మిల బెంగళూరు పర్యటనపై ఈ పరిణామాలు ప్రభావం చూపుతాయా? అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. అయితే, పిటిషన్ దాఖలు కావడం, ఆస్తి హక్కులపై వ్యక్తమవుతున్న వాదనలు, కోర్టు తుది నిర్ణయం-ఈ మూడింటిని వేర్వేరుగా చూడాల్సి ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
YCP