Ys Rajareddy sister: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేనత్త కమలమ్మ కన్నుమూత.. ఏంజరిగిందంటే..?..
ys kamalamma demise: కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కమలమ్మ.. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడ ట్రిట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అమెరికాలో తుదిశ్వాస విడిచారు.
Ys Raja Rajasekhar reddy aunt ys kamalamma passed away: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ మేనత్త వైఎస్ కమలమ్మ (వైఎస్ రాజారెడ్డి సోదరి) కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో కమలమ్మబాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లి తన కూతురు వద్ద ఉండి చికిత్స చేయించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అమెరికాలోనే తుదిశ్వాస విడిచారు. ఇటీవల జగన్ దంపతులు పులివెందులలో కమలమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు.
ప్రస్తుతం అమెరికా నుంచి కమలమ్మ భౌతిక కాయంను పులివెందులకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కమలమ్మ మరణం పట్ల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, వైసీపీ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ సంతాపంను కూడా వ్యక్తం చేస్తున్నారు.