Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఐదుగురు భక్తులకు తీవ్ర గాయాలు.!.
Ghat road accident in tirumala: రోడ్డు పక్కన ఉన్న కొండను కారు బలంగా ఢీకొనడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తులకు తీవ్రగాయాలయ్యాయి.
Five devotees injured after Car accident in Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు భక్తులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో ఘాట్ రోడ్డు మలుపుల వద్ద కొంత మంది నెగ్లీజెన్సీగా వాహనాలు నడిపిస్తున్నారు. సరైన విధంగా డ్రైవింగ్ రాకున్న వాహనాల్లో రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు వద్ద కారు అదుపుతప్పి కొండను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఆరుగురు భక్తులు ప్రమాదంకు గురయ్యారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరోసారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మాల్వాడి గుండం సమీపంలో కారు అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. దీంతో కారు బొల్తా పడింది. కారు ప్రమాదం జరిగిన సమయంలో దానిలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వెంటనే ఆ మార్గంలో వెళ్తున్నభక్తులు సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్ కు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. క్షతగాత్రులను వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంతో మొదటి ఘాట్ రోడ్డులో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే.. ప్రమాదానికి అతివేగమా.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా.. ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. మలుపుల వద్ద వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారుల స్పష్టం చేశారు.