• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Tirupati Rain: తిరుపతిలో కుండపోత వర్షం.. జలమయమైన పలు కాలనీలు

Tirupati Rain: తిరుపతిలో కుండపోత వర్షం.. జలమయమైన పలు కాలనీలు

Heavy Rain In Tirupati: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వర్షం పడింది. సాయంత్రం పూట ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్ముకున్నాయి. అనంతరం కొన్ని నిమిషాల్లోనే భారీ వర్షం పడింది. దీంతో తిరుపతి నగరం జలమయమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 21, 2026, 08:53 PM IST|Updated: Sep 21, 2026, 08:56 PM IST
joinshare
Tirupati Rain: తిరుపతిలో కుండపోత వర్షం.. జలమయమైన పలు కాలనీలు
Image Credit: Tirupati Rain

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rain Alert To Tirupati: ఎండ వేడిమి.. అధిక ఉష్ణోగ్రతలు.. ఉక్కపోతతో అల్లాడుతున్న తిరుపతి ప్రజలకు ఊరట లభించింది. తిరుపతిలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సాయంత్రం పూట ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్ముకున్నాయి. అనంతరం కొన్ని నిమిషాల్లోనే భారీ వర్షం పడింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో తిరుపతి నగరం జలమయమైంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విధులు ముగించుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్న సమయంలో వర్షం పడడంతో వాహనదారులతోపాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తిరుపతిలో సోమవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్దిసేపు కుండపోతగా వర్షం పడడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డీఆర్ మహల్, లీలామహల్ సెంటర్‌తో పాటు పలు ప్రధాన రహదారుల్లో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

డీఆర్ మహల్ ప్రాంతంలో రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. లీలామహల్ సెంటర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లోనూ వర్ష ప్రభావం కనిపించింది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో ట్రాఫిక్ నెమ్మదించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల హెచ్చరిక జారీ చేసింది.

వాయుగుండం కారణంగా సెప్టెంబర్ 22 నుంచి 25వ తేదీ వరకు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అరకు, మారేడుమిల్లి, వనజంగి, ఒడిశా ప్రాంతాలకు పర్యటనలకు వెళ్లేవారు సెప్టెంబర్ 22-25 మధ్య ఆ ప్రయాణాలను కచ్చితంగా వాయిదా వేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Weather Update