High tension at tadipatri amid gram panchayat elections row: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇప్పటికే ఏపీ పంచాయతీ ఎన్నికల్ని అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కడప జిల్లాలోని పులివెందులలో ఎంపీ అవినాష్ కాన్వాయ్ పై ప్రత్యర్థి వర్గం పెట్రోల్ బాంబుతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పులివెందులలో సైతం ఉద్రిక్తత కొనసాగుతుంది.
తాడిపత్రిలో అరాచకం... మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై హత్యాయత్నం. పెద్దారెడ్డి ఇంటిపై జేసీ వర్గీయుల రాళ్ల దాడి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి చెందిన 10 స్కార్పియో వాహనాలు ధ్వంసం సుమారు 20 బైకులకు నిప్పు పెట్టిన జేసీ వర్గీయులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం తాడిపత్రి లో నిన్నటి నుంచి వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్న జేసీ వర్గీయులు ఈరోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం తో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పై దాడులకు తెగబడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పోలీసుల ప్రేక్షక పాత్ర. #ysrcp #appolice #apvoilence #tadpatri
— Ismail (@smylish) November 20, 2026
మరోవైపు తాడిపత్రి రాజకీయాలు సైతం కాకరేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య కొన్ని రోజుల నుంచిసవాళ్ల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంలోకి టీడీపీ వర్గీయులు దూసుకుని వెళ్లి పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఆయన గ్రౌండ్ ఫ్లోర్ లో జనరేటర్ కు నిప్పంటించి నానా బీభత్సం చేశారు. దాదాపు పదుల సంఖ్యలో కార్లు, బైక్ లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. సజ్జలదిన్నె, ఇగుడూరు గ్రామాల్లో వాహనాలను తగలబెట్టారు.
అయితే.. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల్ని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే తాడిపత్రిలో అరాచకాలు జరుగుతున్నాయని వైసీపీ విమర్శలు చేస్తుంది. టీడీపీ వారు దాడులు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడుల్లో పెద్దారెడ్డి నివాసంలో ఉన్న 6 కార్లు, 30కి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు వైసీపీ ఆరోపిస్తుంది. ఈ ఘటనతో తాడిపత్రి ప్రస్తుతం నివురు కప్పిన నిప్పులా ఉంది. మరోవైపుకేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసుల్ని అల్లర్లు జరిగిన ప్రదేశంకు వెళ్లకుండా అడ్డుకున్నారు.