Kalki Bhagavan Maha Samadhi: ప్రముఖ ఆధ్యాత్మిక మార్గదర్శకులు, లక్షలాది మంది భక్తులను విషాదంలో ముంచి ఆరాధ్య దైవం శ్రీ గురుదేవులు కల్కి భగవాన్ ఇక లేరు. ఆయన మహాసమాధి చెందారని ఏకమ్ ఆశ్రమం ప్రతినిధులు ప్రకటించారు. ఆత్మజ్ఞాన సందేశాలు, మానవతా విలువలు, సేవా భావంతో సమాజంలో చెరగని ముద్ర వేసిన కల్కి భగవాన్ కన్నుమూయడంతో అతడి భక్తులు శోకసంద్రంగా మునిగారు. నిర్యాణ వార్త తెలియడంతో దేశవిదేశాల్లోని భక్తులు, శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతికి.. విషాదానికి లోనయ్యారు.
ఏపీలోని తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లం వద్ద ‘ఏకం’ క్షేత్రం కల్కి భగవాన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆశ్రమంలోనే ఆయన నిర్యాణం చెందారు. భక్తుల సందర్శనార్థం భగవాన్ భౌతిక దేహాన్ని ఆశ్రమంలో ఉంచుతారు. గురుదేవుల భౌతిక దేహాన్ని రేపటి నుంచి మూడు రోజుల పాటు భక్తుల చివరి దర్శనం కోసం ఉంచనున్నట్లు ఆశ్రమం ప్రతినిధులు ప్రకటించారు. తమ గురువును కడసారి దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.