Raptadu Girl Incident: మృత్యువుతో పోరాడి గెలిచిన రాప్తాడు బాలిక.. మణిపాల్ ఆస్పత్రిలో కేక్ కట్ చేసి సంబరాలు.. వీడియో వైరల్..
Raptadu girl news: రాప్తాడులో ఉన్మాది హేమంత్ చేతిలో తీవ్రంగా గాయపడ్డ బాలిక స్పీడ్ గా కోలుకుంటుంది. ఈక్రమంలో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు కేక కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మరోవైపు బాలికకు కోలుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి నారాలోకేష్ హర్షం వ్యక్తం చేశారు.
Raptadu incident girl cake cutting in manipal hospital: ఆంధ్ర ప్రదేశ్ లోని రాప్తాడులో ఉన్మాది హేమంత్ చేతిలో బాలిక తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బాలికకు ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్యం గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అయితే.. తాజాగా.. బాలికలో మరింత ఆత్మస్థైర్యంతో పాటు, ఉత్సాహం నింపేలా వైద్యులు ఆస్పత్రిలో సిబ్బంది కేక్ కట్ చేయించారు.
బాలిక తొందరగా ఇంకా బాగా కోలుకొవాలంటూ సంబరాలు నిర్వహించారు. తాము అనుకున్నదాని కన్న బాలిక తొందరగా కొలుకుందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు బాలిక వేగంగా కొలుకొవడం మంచి పరిణామం అంటూ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. బాలికకు ప్రాణాపాయం తప్పడం చాలా ఆనందంగా ఉందని, ఇంకా తొందరగా కోలుకొవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నట్లు మంత్రి నారాలోకేష్ వెల్లడించారు.
ఇప్పటికే వైద్యులు రాప్తాడు బాలికకు పలుమార్లు ప్లాస్టిక్ సర్జరీలతో పాటు, ఆర్థోపెడిక్స్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో బాలిక స్పీడ్ గా రికవరీ అవుతుంది. మరోవైపు అక్టోబరు 31న అనంతపురం రాప్తాడు స్కూల్లో బాలికపై రంపంతో దాడి చేసిన హేమంత్ కు ఒక కాలును వైద్యులు తొలగించారు. ప్రస్తుతం అతడ్ని అనంతపురం జైలుకు తరలించారు.