• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /RK Roja Tonsure: మాజీ మంత్రి రోజా 'గుండు'పై దుష్ప్రచారం.. ఖండించిన టీటీడీ మాజీ చైర్మన్

RK Roja Tonsure: మాజీ మంత్రి రోజా 'గుండు'పై దుష్ప్రచారం.. ఖండించిన టీటీడీ మాజీ చైర్మన్

RK Roja Tonsured Rumours: తిరుమల పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా గుండు చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రోజాపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 25, 2026, 07:19 PM IST|Updated: Sep 25, 2026, 07:25 PM IST
joinshare
RK Roja Tonsure: మాజీ మంత్రి రోజా 'గుండు'పై దుష్ప్రచారం.. ఖండించిన టీటీడీ మాజీ చైర్మన్
Image Credit: Source: Bhumana Karunakar Reddy Facebook

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YSRCP: తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా చాలా దారుణంగా వ్యవహరిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగహం వ్యక్తం చేశారు. టీడీపీ  చెందిన సోషల్ మీడియా పైత్యం బాగా ముదిరిపోయిందని.. దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జరగనటువంటిదాన్ని జరిగినట్లుగా చూపిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజా గుండు చేయించుకున్నారని ట్రోల్‌ చేస్తున్నారని భూమన కరుణాకర్‌ రెడ్డి చెప్పారు.

తిరుపతిలో శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తే.. ఆమె తలనీలాలు సమర్పించినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. 'సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్స్‌కు జీతాలు ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఇలాంటి జీతగాళ్లను తయారుచేస్తున్నారు' అని మండిపడ్డారు.

ప్రభుత్వ సొమ్ము ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేతకు వాడి, తీవ్రమైన వాఖ్యలు, అసభ్య పదజాలం, వ్యక్తిత్వ హననం చేయడానికి సోషల్ మీడియాలో వినియోగిస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తాము చేయని అభివృద్దికి గొప్పలు ప్రచారం చేసుకునేందుకు ఈ రకమైన దాడిలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తిరుమల శ్రీవారి ఎవరైనా.. ఎంతటివారైనా తలనీలాలు సమర్పించే సాంప్రదాయం ఉంది. నిన్న ఆమె దర్శనం సమయంలో తలనీలాలు ఇవ్వకపోయినా.. శిరోముండనం చేసినట్లుగా పైశాచిక ఆనందం పొందితే ఆ ఆనందం మీకు తప్పా? వెంకటేశ్వరస్వామి భక్తులకు రాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వచ్చిన నష్టం లేదు' అని స్పష్టం చేశారు.

'మాజీ మంత్రి ఆర్‌కే రోజా తలనీలాలు సమర్పించారని ప్రచారం చేసుకోవడం వంటివి చూసి ప్రజలు మిమ్మల్ని చూసి చీత్కరించుకుంటారు. అసహ్యించుకుంటారు. దీంతో ఏ రకమైన ప్రయోజనం లేదు. ఇలాంటి దుర్మార్గపు చేష్టలు చేసిన వారిపని భగవంతుడే చూస్తారు' అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని గురువారం మాజీ మంత్రి ఆర్‌కే రోజా దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో రోజా దర్శనం చేసుకోగా.. ఈ సందర్భంగా ఆమె తిరుమలలో పర్యటించిన అంశంపై కొందరు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారని వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Tirupathi
AP News
YS Jagan Mohan Reddy