SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala: తిరుమలలో పెను విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన భక్తుడు.. అసలేం జరిగిందంటే..?

Pilgrim died in tirumala: తమిళనాడుకు చెందిన భక్తుడు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లాడు. రాంబగీచా బస్టాండ్ కు వెళ్తుండగా ఛాతీలో నొప్పి అంటూ కుప్పకూలీ పడిపోయాడు. వెంటనే చుట్టుపక్కల వారు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుతో చనిపోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో తిరుమలలో విషాదం చోటు చేసుకుంది.

Written By Inamdar Paresh
Published: Nov 25, 2026, 18:23 IST | Updated: Nov 25, 2026, 18:32 IST
Image Credit: Tamil nadu man dies in tirumala
Join

Tamil nadu devotee died by heart attack in Tirumala: కార్తీక మాసం వేళ తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది.  మరోవైపు ఇటీవల కార్తీక పౌర్ణమి పండగ వేళ తిరుమలలో కార్తీక దీపం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మరోవైపు తిరుమలలో ప్రతి రోజు వేలాదిగా భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. స్వామి వారి చల్లని చూపు కోసం ఎన్నిగంటలైన క్యూలైన్ లో వేచి ఉంటారు.  మరోవైపు టీటీడీ సైతం తిరుమలలో కార్తీక మాసం, రాబోయే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తమిళనాడు తంజావురు ప్రాంతం నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుడు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు.


తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి చెందిన వాయల్ రాజ్ (55) అనే వ్యక్తి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చాడు. రాంబగీచా బస్టాండ్ లో అతను నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పితో కుప్పకూలి పడిపోయాడు. ఇంతలో  చుట్టుపక్కల వారు స్పందించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడ్ని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు.

 వెంటనే వైద్యులు తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. అతని వద్ద ఉన్న ఐడీ కార్టులు, ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. తిరుమల దర్శనం కోసం వచ్చి శ్రీవారి సన్నిధిలోనే తమ కుటుంబ సభ్యుడు  చనిపోయాడని తెలిసి అందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటనపై టీటీడీ సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.  భక్తులు తగిన జాగ్రత్తలతో తిరుమల శ్రీవారి దర్శనాలకు రావాలని టీటీడీ పలు సూచనలు చేసింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES