• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /వైభవంగా జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఘట్టం..

వైభవంగా జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఘట్టం..

Tirumala Brahmothsavalu: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘట్టం వైభవంగా జరిగింది. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Reported ByTA Kiran Kumar SharmaEdited ByTA Kiran Kumar Sharma
Published: Sep 15, 2026, 08:53 AM IST|Updated: Sep 15, 2026, 09:03 AM IST
joinshare
వైభవంగా జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఘట్టం..
Image Credit: Tirumala Brahmothsavalu

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Salakatla Brahmothsavalu 2026: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ యేడాది అధిక మాసం సందర్భంగా రెండు సార్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా  బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలని సంకల్పిస్తూ భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నవధాన్యాలను నాటారు. ముందుగా శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేలా విష్వక్సేనులవారి ఉత్సవాన్ని నిర్వహించారు.


వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహణ..
ఈరోజు సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు రానున్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాల స్వీకరిస్తారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొని హారతి స్వీకరించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ రోజు  ఉదయం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు.


కార్యక్రమంలో పాల్గొన్న పెద్దజీయర్ స్వామి,చిన్న జీయర్ స్వామి..

అనంతరం ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం జరిగింది.  భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి. పుట్టమన్నుతో నింపిన పాలికల్లో నవధాన్యాలను నాటారు.. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరగాలని.. స్వామివారి ఆశీస్సులు లభించాలని సంకల్పిస్తూ ఈ క్రతువును నిర్వహిస్తారు. అంకురార్పణలో నాటిన నవధాన్యాలు బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా సంరక్షిస్తారు. ఉత్సవాల చివరి రోజున వీటిని స్వామివారికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
TTD News
Tirumala
Tirupathi
AP News