• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /కనుమరుగవుతున్న పచ్చని కొండలు.. సిద్ధేశ్వరుని గుట్టను పిండి చేస్తున్న యంత్రాలు..!

కనుమరుగవుతున్న పచ్చని కొండలు.. సిద్ధేశ్వరుని గుట్టను పిండి చేస్తున్న యంత్రాలు..!

Tirupati Illegal Soil Mining: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రకృతి సంపదకు రక్షణ కరువైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి! రామచంద్రపురం మండలంలో కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకుని మట్టి మాఫియా రెచ్చిపోతోంది. హిటాచీలు, జేసీబీలతో గుట్టలను చదును చేస్తూ మట్టి, రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. ముఖ్యంగా సర్వే నంబర్ 28లోని సిద్ధేశ్వరుని గుట్టను కూడా వదలకుండా తవ్వేస్తుండటం కలకలం రేపుతోంది. అసలు ఈ తవ్వకాలు ఎవరి అండతో జరుగుతున్నాయి..? వీటికి అనుమతులు ఉన్నాయా..? అధికారుల పర్యవేక్షణ ఏది..? జీ తెలుగు న్యూస్ స్పెషల్..

Written ByAshok Krindinti
Published: Oct 01, 2026, 01:52 PM IST|Updated: Oct 01, 2026, 01:56 PM IST
joinshare
కనుమరుగవుతున్న పచ్చని కొండలు.. సిద్ధేశ్వరుని గుట్టను పిండి చేస్తున్న యంత్రాలు..!
Image Credit: Tirupati Illegal Soil Mining

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tirupati Illegal Soil Mining: తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం ఒకప్పుడు పచ్చని చెట్లు, సహజసిద్ధమైన కొండలతో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ, ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ భూములే లక్ష్యంగా మట్టి మాఫియా విరుచుకుపడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలూ రాత్రీ తేడా లేకుండా హిటాచీలు, జేసీబీలు, టిప్పర్ల శబ్దాలతో ఈ ప్రాంతం హోరెత్తిపోతోంది. భారీ యంత్రాలతో గుట్టలను చదును చేస్తూ మట్టిని బయటకు తీస్తున్నారు. తవ్వకాల్లో వస్తున్న విలువైన రాళ్లను సైతం టిప్పర్లలో నింపి తరలించేస్తున్నారు. ఫలితంగా కళ్లముందే కొండలు కనుమరుగైపోతున్నాయి.

ముఖ్యంగా రామచంద్రపురం మండలంలోని సర్వే నంబర్ 28లో ఉన్న సిద్ధేశ్వరుని గుట్టపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. పవిత్రమైన ఈ గుట్టను కొందరు వ్యక్తులు భారీ యంత్రాలతో పిండిచేస్తున్నారు. సహజసిద్ధమైన కొండ ప్రాంతాన్ని ఇలా ధ్వంసం చేయడానికి అసలు ఏ శాఖ అనుమతి ఇచ్చింది..? ఎవరు వెనకుండి నడిపిస్తున్నారు..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరోవైపు ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను నరికివేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడాల్సిన చోటే ఇలా యంత్రాలతో దోపిడీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సహజ సిద్ధమైన ప్రకృతి నశించిపోతోందని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ తవ్వకాలకు సంబంధించి గనుల శాఖ గానీ, అటవీ శాఖ గానీ అనుమతులు ఇచ్చాయా..? ప్రభుత్వ భూముల్లోకి ఈ భారీ యంత్రాలు ఎలా వచ్చాయి..? నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ దందాపై అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

కొండలు, గుట్టలు కనుమరుగైతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. వర్షపు నీటి ప్రవాహ మార్గాలు మారిపోయి, భవిష్యత్తులో తీవ్రమైన భూగర్భ జలాల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రకృతిపై పడుతున్న ఈ ప్రతికూల ప్రభావంపై అధికారులు తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అక్రమ తవ్వకాల వెనుక రాజకీయ నాయకులు, యంత్రాల యజమానుల పాత్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. సిద్ధేశ్వరుని గుట్టతో పాటు రామచంద్రపురం మండలంలో జరిగిన మట్టి, రాళ్ల అక్రమ రవాణాపై అధికారులు సమగ్ర విచారణ జరిపితేనే అసలు సూత్రధారులు ఎవరో బయటపడతారు. ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని ప్రకృతి సంపదను కాపాడుతుందో లేదో చూడాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirupathi
Telugu News
AP News