• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /నేటి నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. టీటీడీ విస్తృత ఏర్పాట్లు..

నేటి నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. టీటీడీ విస్తృత ఏర్పాట్లు..

Tirumala News: తిరుమలలో నేటి నుండి 20వ తేదీ వ‌ర‌కు అంగరంగ వైభవంగా శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు జరుగనున్నాయి. ఇందుకుగాను ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ సంద‌ర్భంగా సేనాధిప‌తి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 12, 2026, 07:18 AM IST|Updated: Oct 12, 2026, 03:24 PM IST
joinshare
నేటి నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. టీటీడీ విస్తృత ఏర్పాట్లు..
Image Credit: TTD News(ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Old Rupee Scam: మీ దగ్గర పాత రూపాయి నోటు ఉందా? ఒక్కో నోటుకు రూ.45 లక్షలు ఆఫర్..కట్‌చేస్తే..!

Old Rupee Scam: మీ దగ్గర పాత రూపాయి నోటు ఉందా? ఒక్కో నోటుకు రూ.45 లక్షలు ఆఫర్..కట్‌చేస్తే..!

2

Sydney Sweeney Athlete Ad: యాడ్ కోసం దిగజారిపోయిన హాలీవుడ్ నటి.."నా లోదుస్తులు ఏ రంగో తెలుసా?" అంటూ కామెంట్!

3

Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

4

Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

5

KBR పార్క్‌ కూడళ్ల విస్తరణకు చకచకా ఏర్పాట్లు.. బాలకృష్ణ ఇంటి నుంచి భూసేకరణ ప్రారంభం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

TTD Brahmotsavalu: అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో అంటే ఆశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు.

ఈ రోజు నుంచి 20వ తేది వరకు బ్రహ్మోత్సవాలు..

ఇక ఇవాళ ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి పెద్దశేష వాహన సేవ  ఉంటుంది. అక్టోబరు 13న ఉదయం  చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. ఇక అక్టోబరు 14న ఉదయం సింహ వాహన సేవ , రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు విహరిస్తారు. అక్టోబరు 15 ఉదయం  కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహన సేవ వుంటుంది. ప్రధానంగా అక్టోబరు 16న గరుడ వాహనం, 17న పుష్పక విమానం, అక్టోబరు 19న స్వర్ణ రథం, 20న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది.

ట్రాఫిక్ నియంత్రణకు పెద్ద చర్యలు..

బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. నాలుగు మాడ వీధుల్లో బ్యారికేడ్లు, క్యూలైన్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అక్టోబర్ 16న జరగనున్న గరుడ వాహనసేవ సందర్భంగా భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

టీటీడీ విస్తృత ఏర్పాట్లు.. 
ఇక గత నెలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలో నేటి నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలనూ వైభవంగా నిర్వహించనున్నారు. దసరా సెలవులతోపాటు తమిళ పెరటాశి మాసం చివరి వారం కావడంతో ఈ బ్రహ్మోత్సవానికి భక్తులు భారీగా వస్తారనే అంచనాతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
TTD News