• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /KBR పార్క్‌ కూడళ్ల విస్తరణకు చకచకా ఏర్పాట్లు.. బాలకృష్ణ ఇంటి నుంచి భూసేకరణ ప్రారంభం..

KBR పార్క్‌ కూడళ్ల విస్తరణకు చకచకా ఏర్పాట్లు.. బాలకృష్ణ ఇంటి నుంచి భూసేకరణ ప్రారంభం..

KBR Park Surrouding Areas Expansion: హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు చుట్టూఉన్న రోడ్డు విస్తరణ పనులు వడివడిగా సాగుతున్నాయి. అంతకు ముందు రూ.1,090 కోట్లతో చేపట్టాలనుకున్న హెచ్‌సిటీ ప్రాజెక్ట్‌ రద్దు కావడంతో.. ప్రత్యామ్నాయ ప్రాజెక్టులో భాగంగా ఎలివేటెడ్‌ కారిడార్‌ను తెరపైకి తెచ్చారు.దాదాపు అంతే వ్యయంతో నాగార్జున సర్కిల్‌ ఎగువ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు 4.3 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 12, 2026, 02:00 PM IST|Updated: Oct 12, 2026, 02:04 PM IST
joinshare
KBR పార్క్‌  కూడళ్ల విస్తరణకు చకచకా ఏర్పాట్లు.. బాలకృష్ణ ఇంటి నుంచి భూసేకరణ ప్రారంభం..
Image Credit: Balakrishna House Demolish (Zee News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

Jantar Mantar Protest Ban: ఇకపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు నిషేధం..ఆ మూడు మైదానాల్లో అనుమతి!

2

Zayn Marie Khan CJP Protest: 'డెకాయిట్' హీరోయిన్, అమీర్ ఖాన్ మేనకోడలిపై పోలీసుల లాఠీ ఛార్జ్..ముంబైలో ఏం జరుగుతోంది?

3

KBR పార్క్‌ కూడళ్ల విస్తరణకు చకచకా ఏర్పాట్లు.. బాలకృష్ణ ఇంటి నుంచి భూసేకరణ ప్రారంభం..

4

'జీ తెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ & టీచర్స్ అవార్డ్స్ 2026– గురు వందనం'..

5

AP Rythu Bazar Rice Price: ఏపీలో పేదలకు భారీ ఉపశమనం..రైతు బజార్లో రూ.49, రూ.50లకే సన్నబియ్యం పంపిణీ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Land Acquisition at KBR Park Area: కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ కూడళ్లను విస్తరించే పనిలో పడ్డారు జీహెచ్‌ఎంసీ అధికారులు.  ఇందులో భాగంగా భూసేకరణ చేపట్టి పలు జంక్షన్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు.ఆయా చౌరస్తాల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ చేపట్టనున్నారు. హీరో  తెలుగు దేశం నేత హిందూపురం  ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, శబ్దాలయ స్టూడియో అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డి, భవ్య నిర్మాణ సంస్థ అధినేత ఆనంద్‌ప్రసాద్‌ కు చెందిన భూముల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు వారు సైతం భూములు ఇచ్చేందుకు అంగీకరించారు.

శబ్దాలయ స్టూడియో స్థలం..

శబ్దాలయ స్టూడియో, ప్రసాద్‌ ల్యాబ్, కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు మార్గంలో జంక్షన్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీనికిగాను శబ్దాలయ స్థలం 608 గజాలు అవసరమని గుర్తించారు. సుమారు రూ.30.40 కోట్లు విలువ ఉంటుంది. టీడీఆర్‌కు శబ్దాలయ సంస్థ అంగీకరించింది. 
బంజారాహిల్స్‌ నుంచి హైటెక్‌సిటీ వైపు వెళ్లేందుకు రోడ్డు నంబరు 45 కూడలి కీలకంగా వుంది.. ఇక్కడే సినీ నటుడు బాలకృష్ణ నివాసం ఉంది. ఈ కూడలి అభివృద్ధికి బాలకృష్ణ నివాసంలో 862.77 చ.గజాల స్థలం సేకరించాలని నిర్ణయించారు. దీనికి బాలకృష్ణ అంగీకరించారని అధికారులు వెల్లడించారు.

బాలయ్య ఇంటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. 

ఈ స్థలాన్ని తీసుకోవడం ద్వారా బాలకృష్ణ కూడా అక్కడి నుంచి వేరే చోటుకు షిఫ్ట్ కానున్నట్టు సమాచారం. . ఈ ఇంటితో ఆయనకు సెంటిమెంట్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్‌ ఇక్కడే అభిమానులను కలిసే వారని గుర్తు చేసుకుంటున్నారు.
ఫిల్మ్‌నగర్‌ జంక్షన్‌.. దీన్ని అభివృద్ధి చేయాలంటే భవ్య కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు చెందిన 341.33చ.గజాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ స్థలం ఇచ్చేందుకు సంస్థ యజమాని ఆనంద్‌ప్రసాద్‌ అంగీకరించడంతో ప్రధాన జంక్షన్ల అభివృద్ధికి మార్గం సుగమం అయ్యింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telugu News
Telangana News