Ttd cancels ssd tokens darshan for tomorrow: కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాదిగా భక్తుల తరలివస్తారు. ఈ క్రమంలో టీటీడీ సైతం సామాన్య భక్తులకు దర్శనాలు అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు ఇటీవల తుపాన్ నేపథ్యంలో తిరుమలలో విపరీతంగా చలి తీవ్రత పెరిగింది. ఇంత చలిలో కూడా శ్రీవారిని దర్శనాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుమలలో ప్రతి రోజు టీటీడీ మూడు చోట్ల ఎస్ఎస్ డీ టొకెన్లను జారీ చేస్తుంది.
తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల దగ్గర తిరుమల శ్రీవారి దర్శరం SSD టోకెన్లను టీటీడీ ప్రతిరోజూ జారీ చేస్తారు. భక్తుల రద్దీని బట్టి టోకెన్ల జారీ సమయాల్లో సైతం టీటీడీ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది.
ప్రస్తుతం తిరుమలలో విపరీతంగా రద్దీ పెరిగిపోవడంతో గురువారం దర్శనాల కోసం నేడు జారీ చేసే ఎస్ ఎస్ డీ టొకెన్లను టీటీడీ రద్దుచేసింది. ముఖ్యంగా కాలినడకన వెళ్లే భక్తులు ఎస్ ఎస్ డీ టొకెన్లు తీసుకుని శ్రీవారి దర్శనాలు చేసుకుంటారు. ఈ క్రమంలో గురువారం రేపటి దర్శనాలకు ఈరోజు ఇచ్చే ఎస్ ఎస్ డీ టొకెన్లను టీటీడీ రద్దు చేసింది. మరల శుక్రవారం దర్శనాలకు టీటీడీ యథా ప్రకారం రేపు గురువారం ఎస్ఎస్ డీ టొకెన్లును జారీ చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలనో వెల్లడించింది.
తిరుమలలో మంగళవారం అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌజ్ వరకు క్యూలైన్‌లలో భక్తులు వేచి ఉన్నారు.. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రూ. 300 టొకెన్లు ఉన్న వారికి 3 నుంచి 4 గంటలు,ఎస్ ఎస్ డీ టొకెన్లు ఉన్న వారికి 5 గంటల సమయం పడుతుంది. సోమవారం స్వామివారిని 69,495 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4.09 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.