Tirumala: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. బ్రహ్మోత్సవాల్లో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్.!. అసలు కారణం ఇదే..
Tirumala break darshan cancelled: నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులకే టీటీడీ పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ పటిష్టమైన చర్యలు చేపట్టింది.
TTD Cancels VIP break darshan Recommendation Letters in tirumala: తిరుమల మరోసారి బ్రహ్మోత్సవలకు సిద్దమైంది. కొన్ని రోజుల క్రితమే సాలకట్ల బ్రహ్మోత్సవలు కన్నుల పండుగలా జరిగింది. మరోవైపు మరల నవరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో కళకళ లాడుతుంది. ఇప్పటికే భక్తులు శ్రీవారి దర్శనాలకు పొటెత్తారు. అంతే కాకుండా టీటీడీ సైతం సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యతను ఇచ్చేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 19 వరకు 10 రోజుల పాటు తిరుపతిలో మూడు చోట్ల ఇచ్చే ఎస్‌ఎస్‌డీ ,దివ్యదర్శనం (DD) టోకెన్ల జారీని టీటీడీ పూర్తిగా రద్దు చేసింది.
అయితే ప్రొటొకాల్, సిఫారసులు మాత్రం అనుమతించింది. అయితే.. తాజాగా.. టీటీడీ తీసుకున్న నిర్ణయం మాత్రం వార్తలలో నిలిచింది. ఈ పదిరోజుల పాటు వీఐపీల నుంచి సిఫారసు లేఖలను కూడా అనుమతించబోమని టీటీడీ ప్రకటించింది. కానీ ప్రొటొకాల్ భక్తులకు యథా తథంగా దర్శనాలు కల్పిస్తామని తెలిపింది. దీంతో భక్తులు టీటీడీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. ఈ రాత్రి 7 గంటలకు సేనాధిపతి విష్వక్సేనుల వారి ఊరేగింపుతో ఈ ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణను పండితులు చేయనున్నారు. దీనిలో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 9 గంటలకు బంగారు తిరుచి ఊరేగింపు జరగనుంది.
అలాగే రాత్రి 7 గంటలకు ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారు తొలి వాహనమైన పెద్దశేష వాహనంపై విహరిస్తు భక్తులకు దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ప్రతి రోజు వివిధ వాహనాల్లో విహరిస్తు.. అక్టోబర్ 20 వరకు మలయప్ప స్వామి వారు భక్తులను అనుగ్రహించనున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
సర్వదర్శనాలకు 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సుమారు 8 గంటల సమయం, టొకెన్లు ఉన్నవారికి 5 గంటలు, రూ. 300 టొకెన్లు ఉన్నవారికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న (శనివారం) 79,737 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ. 3.71 కోట్ల ఆదాయం హుండీలో కానుకలతో లభించింది.
నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు టీటీడీ తాగునీరు, అన్నప్రసాదం, భద్రత పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఇటీవల టీటీడీ గరుడ యాప్ సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే.