Tirumala: తిరుమలలో భారీ నీటి సంక్షోభం...ఎల్ నినో ప్రభావంపై భక్తులకు టీటీడీ కీలక సూచనలు..
Elnino Effect on tirumala: దేశ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటి వినియోగంపై అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. అయితే.. తిరుమలలో నీటికొరత అంశంపై టీటీడీ రంగంలోకి దిగింది.
TTD key advice to devotees amid el nino effect: దేశ వ్యాప్తంగా ప్రజలు ఎక్కడ చూసిన ఎల్ నినోపై తెగ చర్చలు జరుపున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం వల్ల ఒకవైపు నీరు మరోవైపు నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈక్రమంలో తెలంగాణలోని ఎల్ నినో ప్రభావంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని, రైతుల్ని అప్రమత్తంగా ఉండాలని నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. రైతన్నల్ని నీటి సరఫరా తక్కువగా అవసరం అయ్యే పంటలవైపు మొగ్గుచూపాల్నారు. కొన్ని నెలల పాటు అందరు జాగ్రత్తలు పాటిస్తే ఎల్ నినో కరువు గండం నుంచి బైటపడవచ్చని తెలిపారు. ఇక ఏపీలో ఒకవైపు అర్నబ్ తుపాన్ కొన్ని జిల్లాల్ని అతలాకుతులం చేసిన కూడా ఎల్ నినో ప్రభావం మాత్రం స్ఫష్టంగా కన్పిస్తుంది. కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారమైన తిరుమలలో తాగునీటి నిల్వలపై టీటీడీ ఆందోళనల వ్యక్తం చేసింది. తిరుమలకు ప్రతిరోజు వేలాదిగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనాలకు వస్తారు. దీంతో తిరుమలలో నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది.
తిరుమలలో వర్షాలు కురిస్తేనే జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగే పరిస్థితి ఉండటంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులతో కలిసి తిరుమలలోని పలు జలాశయాలను పరిశీలించారు. తిరుమలలో నీటి నిల్వల పరిస్థితిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.
మరోవైపు తిరుమలలో రోజుకు సుమారు 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుందని అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తులు నీటిని పొదుపుగా వినియోగించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భక్తుల సైతం అనవసరంగా నీళ్లను వృథా చేయడం మానుకొవాలన్నారు. అదే విధంగా.. భవిష్యత్తులో నీటి నిల్వలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే గతంలో సెలవు దినాల్లోనే తిరుమలలో రద్దీ నెలకొనేది.. కానీ ఇటీవల పనిదినాలతో సంబంధం లేకుండా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో నీటి వినియోగం సైతం అదే స్థాయిలో భారీగా పెరిగిపోయింది. తిరుమలలో పాప వినాశనం, గోగర్భం, తిరుపతిలోని కళ్యాని డ్యామ్, కుమార ధార, పసుపు ధార.. మొదలైన వాటిం నుంచి ప్రతిరోజు నీటి సరఫరా జరుగుతుంది. ఈ క్రమంలో టీటీడీ అధికారులు మాత్రం ఎల్ నినో ప్రభావంపై తీసుకొవాల్సిన ముందస్తు చర్యలపై ఇప్పటి నుంచి పలు ప్రణాళికలతో ముందుకువెళ్తున్నట్లు వెల్లడించారు.