Ayyappa Swamy Yatra: ప్రతి సంవత్సరం ఎంతో నిష్టతో శబరిమల యాత్ర చేపట్టే లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తుల భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. శబరిమలకు వచ్చే పంబ, సన్నిధానం మార్గాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు లేదా ప్రమాదాలు జరిగినట్లయితే భక్తులకు వారి కుటుంబాలకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచే విధంగా రూ. 5లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల ప్రమాదం జరిగిన సందర్భంలో బీమా క్లెయిమ్ ప్రక్రియ అనేది మరింత సులభం అవుతుంది. ఈ సీజన్ నుంచి బీమా స్కీమ్ ను అమలు చేయనున్నారు.
అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే సమయంలో నామినీ వివరాలను తప్పకుండా ఎంటర్ చేయాలని బోర్డు తెలిపింది. ఈ విధంగా వివరాలను ఇస్తేనే ప్రమాద బీమా వర్తిస్తుందని స్పష్టం చేసింది. భక్తులు బుకింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఈ చిన్న టెక్నిక్ ను అస్సలు మర్చిపోకూడదు. పతనంతిట్ట, ఇడుక్కి, కొల్లం, అలప్పుజ జిల్లాల పరిధిలో జరిగే ప్రమాదాలకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుందని తెలిపింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సహకారంతో ఈ అద్బుతమైన స్కీమ్ ను అమలు చేస్తున్నారు. యాత్ర సమయంలో భక్తులకు ఇది ఎంతో భరోసానిస్తుంది. అయితే బీమా పూర్తిగా ఉచితమా.. లేదా అదనపు చెల్లింపు చెల్లించాల్సి ఉంటుందా.. పరిహారం పొందేందుకు వర్తించే షరతులు ఏంటనే అంశాలను సంబంధిత అధికారిక మార్గదర్శకాల ద్వారా నిర్దారించుకోవల్సి ఉంటుంది.
అయితే అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం పతనంతట్టి, ఇడుక్కి, కొల్లం, అలప్పుజ జిల్లాల పరిధిలో జరిగే ప్రమాదాలకు ఈ బీమా వర్తిస్తుందని సమాచారం. వర్చువల్ క్యూ ద్వారా బుకింగ్ చేసుకున్న భక్తులతోపాటు స్పాట్ బుకింగ్ చేసుకున్న వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుందని తెలుస్తోంది. అయితే బీమా పరిధి, ప్రమాదాలకు సంబంధించిన నిబంధనలు, పరిహారం పొందేందుకు అవసరమైన పత్రాలపై స్పష్టత కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారిక ప్రకటనను పరిశీలించడం ముఖ్యం.
Also Read: