SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తిరుమల శ్రీవారి భక్తులు అలర్ట్.. జనవరి 2027 స్పెషల్ దర్శనం, రూమ్‌ల బుకింగ్ డేట్స్ రివీల్ చేసిన టీటీడీ!

తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 2027 నెలకు సంబంధించిన కోటా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టీటీడీ ఈ స్లాట్ దర్శనం టికెట్ల వివరాలను వెల్లడించింది. జనవరి నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ అప్‌డేట్స్‌ను గమనించాలి. ఈ కోటాలో ఎలక్ట్రానిక్ డిప్, శ్రీవారి అర్జిత సేవలు, వర్చువల్ సేవలు, ప్రదక్షిణ, స్పెషల్ దర్శనంతో పాటు సీనియర్ సిటిజన్ గదుల బుకింగ్ కూడా అందుబాటులో ఉంటాయి.

Written By Renuka Godugu
Published: Oct 15, 2026, 04:34 PM IST | Updated: Oct 15, 2026, 04:43 PM IST
Image Credit: TTD Releases January 2027 Darshan
Join

TTD January 2027 darshan booking: సాధారణంగా టీటీడీ ప్రతి నెలా మూడు నెలల ముందే ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తుంది. ప్రస్తుతం 2027 జనవరి నెల షెడ్యూల్ విడుదలైనందున, భక్తులు అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఏ దర్శనం టికెట్లు ఏ రోజు వస్తాయో పూర్తి వివరాలు ఇవే:

జనవరి దర్శనం కోసం ఎలక్ట్రానిక్ డిప్ కోటాలో సుప్రభాతం, తోమాల సేవ, అర్చన , అష్టాదళ పాద పద్మారాధన సేవలు ఉంటాయి. ఇవి అక్టోబరు 19వ తేదీ రాత్రి 10 గంటల నుండి అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ డిప్ ద్వారా ఎంపికైన వారు నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించి టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవచ్చు.

శ్రీవారి అర్జిత సేవలకు సంబంధించిన టికెట్లలో కళ్యాణోత్సవం, ఉంజాల్‌ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారం, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం వంటివి ఉంటాయి. వీటి బుకింగ్ అక్టోబరు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.

వర్చువల్ అర్జిత సేవ టికెట్లైన కళ్యాణోత్సవం, ఉంజాల్‌ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకారం సేవలు అక్టోబరు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి అందుబాటులోకి వస్తాయి.

Read Also: శ్రీవారి సేవలో అద్భుతం.. ధనుర్భంగం ఘట్టాన్ని తలపిస్తూ దివ్యదర్శనం.. మార్మోగిన తిరుమల మాడ వీధులు!
 

అక్టోబరు 23వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల అంగప్రదక్షిణ ఫ్రీ టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్‌ బ్రేక్‌ దర్శనం ఇదే రోజు ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోటా బుకింగ్ అక్టోబరు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమవుతుంది. 
 ఇక అక్టోబరు 24వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు, తిరుచానూరు ప్రత్యేక ఎంట్రీ దర్శనం టికెట్లు (నవంబర్ 2026 కోటాకు సంబంధించి) అందుబాటులో ఉంటాయి.

రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అక్టోబరు 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. అలాగే,  మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ప్రాంతాలలో గదుల కోటా బుకింగ్ కూడా జరుగుతుంది.
భక్తులు టికెట్ల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (ttdevasthanam.ap.gov.in) లేదా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని దేవస్థానం కోరుతోంది. 

టికెట్ల బుకింగ్ విషయంలో సోషల్ మీడియాలో వ్యక్తమైన అనుమానాలకు టీటీడీ స్పష్టీకరణ ఇచ్చింది. సరైన ఇంటర్నెట్, సరైన సమయానికి ప్రయత్నిస్తే టికెట్లు దొరుకవచ్చు. లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నించడం వల్ల ట్రాఫిక్ పెరిగి అందరికీ టికెట్లు దొరకకపోవచ్చునని వివరించింది. వచ్చే నెల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల జరిగే అవకాశం ఉంది. ప్రతి ఏటా టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఈ ఏర్పాట్లు చేస్తుంది. పలు వీఐపీ దర్శనాలను సైతం రద్దు చేస్తూనే ఉంది.

 

 

ఇక ఈ నెల నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారు వివిధ వాహనాలపై భక్తులకు కనువిందు చేస్తున్నారు. చిన్నశేష, పెద్ద శేష, ముత్యపు పందిరితోపాటు కల్పవృక్ష వాహనాల్లో కూడా దర్శనమిచ్చారు.  నవరాత్రుల నాలుగో రోజు ఉభయ దేవతలతో కలిసి బకాసుర వధాలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES