• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /TTD Vaikunta Dwara Darshan: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి..టోకెన్లు ఎలా?

TTD Vaikunta Dwara Darshan: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి..టోకెన్లు ఎలా?

TTD Vaikunta Dwara Darshan 2026: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 20 నుంచి 29 వరకు 8.34 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించనుంది. తొలి రెండు రోజులు ప్రత్యేక SSD టోకెన్ల విధానం, ఆన్‌లైన్ జారీపై నిర్ణయం తీసుకుంది. అలిపిరి కేబుల్ బ్రిడ్జి, యాత్రికుల టౌన్‌షిప్ ప్రాజెక్టులపైనా కీలక నిర్ణయాలు వెల్లడించింది.

Written ByHarish Darla
Published: Nov 19, 2026, 09:20 IST|Updated: Nov 19, 2026, 09:27 IST
joinshare
TTD Vaikunta Dwara Darshan: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. అలిపిరి నడకమార్గంలో కేబుల్ బ్రిడ్జి..టోకెన్లు ఎలా?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

TTD Vaikunta Dwara Darshan 2026: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక ప్రకటనలు చేసింది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనుంది. ఈ సమయంలో సుమారు 8.34 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాన్ని రూపొందించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి మొదటి రెండు రోజులకు సంబంధించిన SSD టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రెండు రోజుల్లో సర్వదర్శనం ఉండదని, ఆ తర్వాతి ఎనిమిది రోజులు భక్తులకు సర్వదర్శనం అమలు చేస్తామని తెలిపారు. టోకెన్ల విడుదల సమయం, బుకింగ్ లింక్, ఇతర నిబంధనలపై టీటీడీ అధికారిక ప్రకటనలను భక్తులు గమనించాలి.

టీటీడీ స్పెసిఫైడ్ కమిటీ సమావేశంలో తిరుమల అభివృద్ధికి సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అలిపిరి-శ్రీవేంకటేశ్వర జూ పార్క్ రోడ్డుకు సమీపంలోని టీటీడీ స్థలంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రూ. 2,750 కోట్ల అంచనా వ్యయంతో యాత్రికుల టౌన్‌షిప్ నిర్మించాలనే ప్రణాళికకు సంబంధించి డీపీఆర్, డిజైన్లు, ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా భక్తులకు మెరుగైన వసతి, ఆధునిక సౌకర్యాలు కల్పించాలనేది లక్ష్యం.

అలిపిరి నడకమార్గంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్లమిట్ట వరకు భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ సాధ్యాసాధ్యాలను ఐఐటీ నిపుణుల సహకారంతో పరిశీలించనున్నారు. మరోవైపు శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారిమెట్టు వరకు రహదారి అభివృద్ధి, ఇంటర్‌లాకింగ్ సిమెంట్ బ్లాకుల ఏర్పాటుకు రూ. 9.50 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు.

టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. 2007 సీనియారిటీ జాబితా ఆధారంగా ఫేజ్-IIIలో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి వారసులకు పల్లం గ్రామంలో ఇంటి స్థలాలు కేటాయించేందుకు ఆమోదించారు. బ్రహ్మోత్సవాల అనంతరం ఇచ్చే కానుకను ఈ ఏడాది పర్మినెంట్ ఉద్యోగులకు రూ. 16,940, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 8,289గా నిర్ణయించారు. ఈ నిర్ణయాలు తిరుమలలో భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన కీలక పరిణామాలుగా నిలుస్తున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
Tirupathi
Telugu News