• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /AP CM Chandrababu on Sakshi: "షర్మిల కూతురి పెళ్లికి పిలిస్తే ఇంత నీచంగా రాస్తారా?" సాక్షి పత్రికపై సీఎం చంద్రబాబు ఫైర్!

AP CM Chandrababu on Sakshi: "షర్మిల కూతురి పెళ్లికి పిలిస్తే ఇంత నీచంగా రాస్తారా?" సాక్షి పత్రికపై సీఎం చంద్రబాబు ఫైర్!

Chandrababu Comments on Sakshi: వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడంపై సాక్షి పత్రిక ప్రచురించిన కథనాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ విభేదాలకు వ్యక్తిగత సంబంధాలను ముడిపెట్టడం సరికాదని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకున్న స్నేహాన్ని గుర్తుచేస్తూ, రాజకీయాలు వేరైనా కుటుంబ కార్యక్రమాలకు ఆహ్వానించడం సహజమని స్పష్టం చేశారు.

Written ByHarish Darla
Published: Nov 21, 2026, 15:27 IST|Updated: Nov 21, 2026, 15:41 IST
joinshare
AP CM Chandrababu on Sakshi: "షర్మిల కూతురి పెళ్లికి పిలిస్తే ఇంత నీచంగా రాస్తారా?" సాక్షి పత్రికపై సీఎం చంద్రబాబు ఫైర్!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chandrababu Comments on Sakshi: వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడంపై సాక్షి పత్రికలో వచ్చిన కథనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. రాజకీయాలకు, వ్యక్తిగత సంబంధాలకు మధ్య తేడా గుర్తించాలని పేర్కొంటూ, పెళ్లి ఆహ్వానాన్ని కూడా వివాదంగా చిత్రీకరించడం సరికాదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, షర్మిల తన కుమార్తె పెళ్లికి స్వయంగా ఆహ్వానించారని వెల్లడించారు. ఒక కుటుంబ కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తే దానిపై బాధ్యతారహితంగా కథనాలు రాయడం ఏమిటని సాక్షి పత్రికను చూపిస్తూ ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు చేసుకునే సమయంలోనూ వ్యక్తిగత గౌరవం, సంబంధాలకు విలువ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా చంద్రబాబు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండి పోరాడినప్పటికీ, వ్యక్తిగతంగా తమ మధ్య సంబంధాలు చెడిపోలేదని చెప్పారు. గతంలో షర్మిల వివాహానికి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా ఆహ్వానించడంతో తాను హాజరయ్యానని, జగన్ వివాహానికి కూడా వెళ్లినట్లు పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ కుటుంబ వేడుకలకు ఆహ్వానించడం, హాజరవడం సహజమైన విషయమని వివరించారు.

1978 నుంచి 1983 వరకు తాను, వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి స్నేహితులుగా ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో ప్రయాణించినా, పరస్పర గౌరవం కొనసాగిందని తెలిపారు. గతంలో పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులతో రాజకీయ పోరాటాలు చేసినప్పటికీ, వ్యక్తిగత సంబంధాలను అవమానించే విధంగా వ్యవహరించలేదని అన్నారు.

మరోవైపు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుండటం, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం వైసీపీకి ఇష్టం లేదని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ విమర్శల పేరుతో రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించే ప్రచారం చేయడం సరికాదని అన్నారు. షర్మిల పెళ్లి ఆహ్వానం నేపథ్యంలో మొదలైన ఈ వివాదం రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలు, మీడియా బాధ్యత, విమర్శల హద్దులపై మరోసారి చర్చకు తెరతీసింది.

(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పత్రిక పేరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించడం జరిగింది. సీఎం ఇచ్చిన వివరణ మేరకు కథనం పేర్కొనబడింది. సదరు పత్రికపై ఎలాంటి జీ తెలుగు న్యూస్ ఎలాంటి కల్పిత కథనాలు అల్లడం వంటివి జరగలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
TDP
YCP