• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /Cyclone Murasu: తీరం వైపు దూసుకొస్తున్న పెను తుపాను.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Cyclone Murasu: తీరం వైపు దూసుకొస్తున్న పెను తుపాను.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Cyclone Murasu Latest News: ‘మురసు’ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

Written ByAshok Krindinti
Published: Nov 02, 2026, 11:39 AM IST|Updated: Nov 02, 2026, 11:41 AM IST
joinshare
Cyclone Murasu: తీరం వైపు దూసుకొస్తున్న పెను తుపాను.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
Image Credit: Pawan Kalyan (Facebook)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Hyderabad: హైదరాబాద్‌లో అమానుషం.. ఐదేళ్ల కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి.. అసలేం జరిగిందంటే..?

Hyderabad: హైదరాబాద్‌లో అమానుషం.. ఐదేళ్ల కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి.. అసలేం జరిగిందంటే..?

2

Amit Shah Padayatra: అమిత్‌ షా మహా పాదయాత్ర.. హైదరాబాద్‌లో ఆ రూట్‌లో అస్సలు వెళ్లరాదు

3

IDBI Deal: ఐడీబీఐ కొనుగోలులో ట్విస్ట్.. బ్యాంక్ డబ్బుతోనే ఫెయిర్‌ఫ్యాక్స్ ప్లాన్.. పూర్తి వివరాలు ఇలా..!

4

Naga Chaitanya: గర్ల్ ఫ్రెండ్‌ని ముద్దు పెట్టుకుంటూ పోలీసులకు దొరికిపోయాను నాగచైతన్య..!

5

Cyclone Murasu: తీరం వైపు దూసుకొస్తున్న పెను తుపాను.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cyclone Murasu Latest News: ‘మురసు’ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉండటంతో గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో పెనుగాలులు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో కుంభవృష్టి కురిసే ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి పొంచి ఉన్న ‘మురసు’ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు  అన్ని శాఖల అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తుపాను తీవ్రతపై సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో మురసు తుపాను ఎఫెక్ట్‌తో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. ఆయా జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. మురసు తుపాను ఈ రోజు తీరం తాకనుందన్న హెచ్చరికల నేపథ్యంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. తుపాను గమనం మారి నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు. మధ్యాహ్నానికి గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తూ, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, మార్కాపురం జిల్లాల్లో కుంభవృష్టితో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ముంపు ముప్పున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అక్కడ తాగునీరు, నిరంతర ఆహార సరఫరా వంటి కనీస వసతులు పక్కాగా కల్పించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఆరు ఎన్డీఆర్ఎఫ్, ఏడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వివరించారు.

ఈదురుగాలుల ధాటికి కూలిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను యుద్ధప్రాతిపదికన తొలగించి రాకపోకలు, విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం చెప్పారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, దెబ్బతిన్న రోడ్లు, ప్రమాదకరమైన కాజ్‌వేల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను నియంత్రించాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే అంటువ్యాధులు ప్రబలకుండా క్లోరినేషన్, బ్లీచింగ్ పిచికారీ వంటి ముందస్తు పారిశుధ్య ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. అలాగే తుపాను శాంతించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రైతుల పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని వేగంగా మళ్లించే ఏర్పాట్లు చేయాలని.. ప్రభుత్వ హెచ్చరికలను పాటిస్తూ తుపాను ప్రభావం తగ్గేంత వరకు ప్రజలు సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Pawan Kalyan
Telugu News
AP News