SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vijayawada Murder Case: విజయవాడలో 9 ముక్కలుగా మహిళ మృతదేహం..యువతి దారుణ హత్య కేసులో కీలక ట్విస్ట్!

Vijayawada Woman Murder Case: విజయవాడ సమీపంలో ఇటీవలే లభ్యమైన మహిళా మృతదేహం కేసులో ఇప్పుడు కీలక ట్విస్ట్ బయటపడింది. మంగళగిరికి చెందిన కళ్యాణి అనే మహిళ మృతదేహాన్ని 9 ముక్కులుగా చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఇప్పుడు ఈ హత్య కేసులో పురోగతిని సాధించేందుకు పెద్ద సవాలుగా మారింది.

Written By Harish Darla
Published: Sep 26, 2026, 03:42 PM IST | Updated: Sep 26, 2026, 03:47 PM IST
Join

Vijayawada Woman Murder Case: విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవర్ ప్లాంట్ కాలవ సమీపంలో మృతదేహ భాగాలు లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ దారుణ సంఘటనపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి వేరు చేసి కాలవలో పడేయడంతో బాధితురాలిని గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ కెనాల్ వద్ద ఒక యువతి మృతదేహ భాగాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని మంగళగిరికి చెందిన కళ్యాణి (29) (అలియాస్ లక్ష్మి/దుర్గా) గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 17న వెలుగుచూసిన ఈ ఘోర హత్య కేసులో బాధితురాలి చేతిపై ఉన్న టాటూ, దుస్తుల ఆధారంగా సోదరుడు తన అక్కగా గురించాడు. వివాహేతర సంబంధం లేదా కుటుంబ విభేదాలు, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమనే కోణంలో ఇబ్రహీంపట్నం పోలీసులు భర్తతో సహా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

విచారణలో భాగంగా పోలీసులు సోషల్ మీడియా ద్వారా వివరాలను, చేతిపై ఉన్న టాటూ చిత్రాలను పంచుకున్నారు. దీని ఆధారంగా బాధితురాలి సోదరుడు పోలీసులను కలిసి, మృతురాలు తన అక్క కళ్యాణి (అలియాస్ లక్ష్మి / దుర్గా, 29) అని ధృవీకరించాడు. పశ్చిమ గోదావరి జిల్లా అంకివీడు మండలం చిన్న తడినాడ గ్రామానికి చెందిన వీరు, చిన్నతనంలోనే తల్లి మరణించడంతో గన్నవరం సమీపంలోని అనాథాశ్రమంలో పెరిగారు. మేజర్ అయిన తర్వాత కళ్యాణి వివాహం చేసుకోగా, భర్తతో విభేదాలు రావడంతో వేరుగా ఉంటూ హోటల్‌లో సప్లయర్‌గా పనిచేస్తోంది.

ఈ హత్య మంగళగిరిలోని ఆమె నివాసంలోనే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై సుమారు 200 పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించడమే కాకుండా, కళ్యాణి కాల్ డేటా ఆధారంగా నలుగురు వ్యక్తుల ఫోన్ నంబర్లను విశ్లేషించారు. 

ఈ క్రమంలో బాధితురాలి భర్తతో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయవాడ సీపీ ప్రత్యేక దృష్టి సారించి నాలుగు దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. హత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలను, నిందితులను త్వరలోనే పూర్తి వివరాలతో వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES