• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి Vs వైఎస్సార్సీపీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి Vs వైఎస్సార్సీపీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

Gorantla Butchaiah Chowdary: వైసీపీతో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో రగడకు దిగారు..! పేరడీ కవితలు... సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు..! అయితే వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలు సైతం ధీటుగా బదులు ఇస్తున్నారు..! ఇంతకీ ఆ రచ్చ ఏంటి...? మంత్రి పదవి కోసమే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల ఆ రూట్ లో వెళ్తున్నారా..! లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!

Written ByAshok Krindinti
Published: Sep 18, 2026, 12:52 PM IST|Updated: Sep 18, 2026, 12:56 PM IST
joinshare
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి Vs వైఎస్సార్సీపీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!
Image Credit: Gorantla Butchaiah Chowdary (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ పై విమర్శలు సంధిస్తున్నారు. సాధారణంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాజీ సీఎం జగన్ పై బుచ్చయ్య ఫైర్ అవుతారు. తాజాగా రూట్ మార్చారు. సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ పోస్టులు పెడుతూ వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల గోరంట్ల మొదటగా ఒక పేరడీ కవితను పోస్ట్ చేశారు. వైసిపి కి ఏమి తెలుసు ఆంధ్రప్రదేశ్ పురోగతి అంటూ ప్రారంభించి... ఆవలింతకు ఆకలి ఎక్కువ.... వైసీపీకి అవినీతి అంటే మక్కువ.... కోనసీమలో కొబ్బరి బొండం... వైసిపి అవినీతికి ఒక దండం.... విశ్వదాభిరామ వినుర వేమ అంటూ విమర్శలు చేశారు. పేరడీ కవిత మాత్రమే కాకుండా మరొక పోస్టు కూడా గోరంట్ల చేశారు. ఒకరోజు వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుకున్నారని తన సెటైరికల్ పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయడానికి వైసిపికి తాము ఛాన్స్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే గోరంట్ల భావన. కూటమి ప్రభుత్వంలో వెలిగొండ ద్వారా నీళ్లు విడుదల చేసి చరిత్ర సృష్టించమనీ... డీఎస్సీ విషయంలో చేసిన ప్రచారంలో వైసిపి ఏపీపీఎస్సీలో దొరికిపోయిందని.. వైసీపీపై తనదైన స్టైల్‌లో బుచ్చయ్య విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీపై సెటైర్లతో గోరంట్ల వరుసగా విడుదల చేస్తున్న పోస్టులు రగడగా మారాయి. ఆ పోస్టులపై వైసీపీ అభిమానులు... ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ధీటుగా ఘాటుగా స్పందిస్తున్నారు. కూటమి పెద్దలు ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఇలా మాట్లాడుకున్నారనీ ఎమ్మెల్యే గోరంట్లకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై జనం నిలదీస్తున్నారు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రానికి  పరిశ్రమలు గ్రాఫిక్స్ లోనే ఉన్నాయి. జగన్ హయాంలో ప్రారంభమైన పోర్టులు, మెడికల్ కాలేజీలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఉచిత బస్సుల్లో మహిళలు కండక్టర్లతో గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలపై ప్రజలను డైవర్షన్ చేద్దాం అంటూ టిడిపి, జనసేన నాయకులు సమావేశంలో మాట్లాడుకున్నారని వైసీపీ అభిమానులు కౌంటర్ ఇచ్చారు. దీంతో పాటు ఏడోసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న మీకు సీఎం చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి ఎందుకు రావడం లేదని గోరంట్ల పై సెటైర్లు వేస్తున్నారు. 

ఒకవైపు గోరంట్ల సెటైర్ పోస్టులు... మరోవైపు వైసీపీ అభిమానుల కౌంటర్లతో సోషల్ మీడియాలో రచ్చ నెలకొంది. గోరంట్ల గతంలోనూ వైసీపీ పై ఇలా సెటైర్ పోస్టులతో విమర్శలు చేసేవారు. అయితే తాజాగా ఆయన చేస్తున్న విమర్శలను వైసిపి అభిమానులు ఘాటుగా తిప్పి కొడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. అయితే బుచ్చయ్య చౌదరి మాత్రం వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే గోరంట్ల తన 80 ఏళ్ల వయసులోనూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా యాక్టివ్ గా పని చేస్తున్నారు.

నియోజకవర్గంలో తరచూ అభివృద్ధి పనుల పర్యటనలు చేస్తూ... తన ఇంటి వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాలు... ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు క్యాబినెట్ లో గోరంట్లకు  మంత్రి పదవి దక్కకపోవడం ఆయన రాజకీయ జీవితంలో వెలితిగా ఉందని అభిమానులు భావిస్తుంటారు. ఇప్పటి వరకు పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏడుసార్లు గెలుపొందారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో మాత్రమే ఆయన మంత్రిగా పనిచేశారు. సామాజిక సమీకరణాలు లేదా ఇతర కారణాలతో గోరంట్లకు చంద్రబాబు ఇప్పటివరకు తన క్యాబినెట్‌లో ఛాన్స్ ఇవ్వలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే రానున్న ఎన్నికల సమయానికి ప్రతిపక్ష వైసిపి మీద ధీటుగా స్పందించడానికి  గోరంట్లకు మంత్రిగా ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

మొత్తంమీద మంత్రి పదవి వస్తుందనే అంచనాలతోనే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల పలుసార్లు తన పెద్దరికం పక్కనపెట్టి పరిధి  దాటి మాట్లాడుతున్నారని ప్రచారం సాగుతోంది. కొన్ని నెలల క్రితమే వైసీపీపై తాము కూడా రప్పా... రప్పా చేస్తామని గోరంట్ల వివాదాస్పద కామెంట్స్ చేశారు. తాజాగా సోషల్ మీడియాలో సెటైర్ పోస్టులతో విమర్శలు ప్రారంభించారు. దీంతో మంత్రి పదవి కోసం మరోసారి ప్రయత్నాలు అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే వైసిపి అభిమానులతో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించిన సోషల్ మీడియా వార్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.
 

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Visakhaptnam
TDP