SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tuni Missing Girl Case: చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

Kakinada girl missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో పోలీసులు మరోసారి రంగంలోకి విచారణ చేపట్టారు. జాగిలాలతో ఆ ప్రాంతంలో మరోసారి జల్లెడపట్టారు. కనీసం తమ పాపకు చెందిన ఆచూకీ ఏదైన లభించక పోదా అని.. ఆ తల్లిదండ్రులు కొండంతో ఆశలతో ఎదురు చూస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 17, 2026, 13:49 IST | Updated: Nov 17, 2026, 14:01 IST
Image Credit: kakinada tuni missing girl case
Join

High court key orders on Kakinada tuni girl missing case: ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ పై ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. చిన్నారి తప్పిపోయి దాదాపు 160 రోజులు దాటుతున్న కూడా ఇప్పటికి బాలిక  ఆచూకీ ఇప్పటికి లభ్యం కాలేదు. మరోవైపు బాలిక జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు గణేష్, భవానీ దంపతులు ఇప్పటికే తమ కూతుర్ని తలచుకుంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలిక చివరగా తమ ఇంట్లో పెంపడు శునకం వెనకాల వెళ్లడం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ తర్వాత శునకం అనారోగ్యంతో జూన్ 13న చనిపోయింది. 

శునకంకు పోస్ట్ మార్టం నిర్వహించగా ఎలాంటి  అనుమానాస్పద విషయాలు బైటపడలేదు. మరోవైపు బాలిక జ్ఞానేశ్వరి మిస్సింగ్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
 హైకోర్టు తాజా ఆదేశాలతో.. అదనపు ఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ నేతృత్వంలో ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మరోసారి బాలిక కోసం సీహెచ్ అగ్రహరం ప్రాంతంలో ఏదైన క్లూ దొరుకుందేమోనని విచారణ చేపట్టారు.

 ఆయిల్ ఫామ్, కొండ ప్రాంతాల్లో మరోసారి అడుగడుగు జల్లెడ పట్టడానికి అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు  గతంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో విస్తృతంగా గాలించినా కూడా ఎలాంటి  ఆచూకీ లభించలేదు. ఇప్పటికే పోలీసులు చిన్నారి గురించి ఏదైన ఆచూకి తెలిపిన వారికి  రూ.లక్ష బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు హైకోర్టు ఆదేశాలతో మరోసారి తుని ఘటన వార్తలలో నిలిచింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES