• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /Vishakapatnam Crime: ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. నమ్మించి నగలతో పరార్..!

Vishakapatnam Crime: ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. నమ్మించి నగలతో పరార్..!

Vishakapatnam Crime: సోషల్ మీడియా పరిచయం విశాఖపట్నంలో ఓ మహిళ కుటుంబాన్ని నిండా ముంచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ మహిళ ఇంట్లో మరో మహిళ ఆశ్రయం పొంది.. చివరకు బంగారం దొచుకుని పరార్ అయింది. విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Nov 16, 2026, 16:47 IST|Updated: Nov 16, 2026, 16:48 IST
joinshare
Vishakapatnam Crime: ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. నమ్మించి నగలతో పరార్..!
Image Credit: Vishakapatnam Crime (Source: AI Generated)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vishakapatnam Crime: ఎవరి ఫ్రెండ్‌షిప్ చివరకు ఎటు దారిస్తుందో చెప్పలేం.. కొందరు వాటిని స్నేహాలుగా మలుచుకుంటే.. మరికొందరు అదే పరిచయాన్ని మోసాలకు వాడుకుంటున్నారు. తెలిసిన మనుషులే నిండా ముంచుతున్న ఈ కాలంలో ఇక సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను పూర్తిగా నమ్మి మోసపోయింది ఓ బాధితురాలు. విశాఖపట్నానికి చెందిన మానేపల్లి నీరజ అనే మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళ పరిచయం అయింది. తాను అనారోగ్యంతో ఉన్నానంటూ చెప్పిన ఆ మహిళ.. నీరజ ఇంటికి వచ్చి ఆశ్రయం పొందింది. కొద్దిరోజుల పాటు అక్కడే ఉంటూ కుటుంబ సభ్యుల నమ్మకాన్ని సంపాదించింది. చివరకు ఇంట్లోని బంగారు, వజ్రాభరణాలను తీసుకుని కనిపించకుండా పోయింది. విశాఖలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మానేపల్లి నీరజ (40)తో సదరు మహిళ 'Smiley-Queen' అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా పరిచయాన్ని పెంచుకుంది. ఆమె వ్యక్తిగత వివరాలు, కుటుంబ విషయాలను ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. తనకు ఆరోగ్యం బాగోలేదని.. ఇబ్బందుల్లో ఉన్నానని ఆ మహిళ చెప్పడంతో నీరజ ఆమెకు ఇంట్లో ఆశ్రయం కల్పించారు. అలా ఇంట్లోకి వచ్చిన మహిళ కొంతకాలం అక్కడే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసిపోయింది.

తన ప్రవర్తనతో ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించింది. ఈ క్రమంలో ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన విలువైన నగలపై కన్నేసింది. అదును చూసుకుని బంగారు, వజ్రాభరణాలను తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో నగలు కనిపించకపోవడంతో నీరజ ఆందోళన చెందింది. 11.3 గ్రాముల బరువున్న డైమండ్ నెక్లెస్‌తో పాటు ఇతర వజ్రాభరణాలు, బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మహిళే ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మహిళ ఎవరనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అవతలి వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా.. వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News