• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /Kakinada Uppada Beach: ఉప్పాడను మింగేస్తున్న గంగమ్మ.. సముద్రంలో కలిసిపోతున్న తీరప్రాంత గ్రామం..!

Kakinada Uppada Beach: ఉప్పాడను మింగేస్తున్న గంగమ్మ.. సముద్రంలో కలిసిపోతున్న తీరప్రాంత గ్రామం..!

Kakinada Uppada Beach: కనుమరుగైపోతున్న గ్రామం.. గంగమ్మ గర్భంలో కలసిపోతున్న ఇళ్లు! కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ప్రసిద్ధ తీరప్రాంతం ఉప్పాడ. జాందానీ చీరలు, ఉప్పాడ పట్టు, కమ్మని ఎండుచేపలకు పేరొందిన ఈ గ్రామం. ప్రస్తుతం భౌతికంగా కనుమరుగైపోయే ప్రమాదంలో పడింది. సముద్రపు రాకాసి అలల ధాటికి ఇప్పటికే కిలోమీటర్ల కొద్దీ నీట మునిగిన ఉప్పడ గ్రామంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ న్యూస్..!

Written ByAshok Krindinti
Published: Sep 28, 2026, 01:13 PM IST|Updated: Sep 28, 2026, 01:15 PM IST
joinshare
Kakinada Uppada Beach: ఉప్పాడను మింగేస్తున్న గంగమ్మ.. సముద్రంలో కలిసిపోతున్న తీరప్రాంత గ్రామం..!
Image Credit: Kakinada Uppada Beach

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kakinada Uppada Beach: ఉప్పాడ.. ఒకప్పుడు కళకళలాడిన మత్స్యకార గ్రామం. 16 వేలకు పైగా జనాభా.. 11,500 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పెద్ద ఊరు. కానీ, ఇప్పుడు ఆ ఊరి ఉనికికే ప్రమాదం వచ్చిపడింది! వరుస తుఫాన్లు, భారీ వర్షాలు, నాటి సునామీ తాకిడికి ఇప్పటికే దాదాపు 2 కిలోమీటర్ల మేర గ్రామం సముద్రంలో కలిసిపోయింది. ఒకప్పటి ప్రభుత్వ గెస్ట్ హౌస్, ప్రాచీన ఆలయాలు, పాఠశాలలు, వందలాది ఇళ్లు గంగమ్మ ఒడిలో కలిసిపోయాయి. మ్యాప్‌లో తప్ప భౌతికంగా ఊరు కనిపిస్తుందో లేదోనని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆకలి వేస్తే అన్నంపెట్టే సముద్రమే తమ ఊరిని మింగేస్తున్నా.. ఉప్పాడ ప్రజలు ఆ గంగమ్మ తల్లిని ఎప్పుడూ విమర్శించలేదు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా సముద్రపు ఒడ్డునే బతుకునీడుస్తున్నారు. అయితే...సమీపంలో నిర్మిస్తున్న హార్బర్ డిజైన్ లోపం వల్ల కూడా అలల ఉధృతి పెరిగి ఊరిపైకి వస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాకాసి అలలు వచ్చినప్పుడు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లడం.. పరిస్థితి సర్దుమణిగాక మళ్లీ రావడం ఇక్కడి ప్రజలకు నిత్యకృత్యంగా మారింది.

గతంలో తీరం కోతను అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్రమంత్రి పళ్ళంరాజు చొరవతో ఇక్కడ 'జియో ట్యూబ్ వాల్' నిర్మించారు. ఆ రాతి గోడ, జియో ట్యూబ్ నిర్మాణం వల్ల కొన్ని ఏళ్ల పాటు అలల ధాటి తగ్గి గ్రామానికి రక్షణ లభించింది. మత్స్యకారులు తీరిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, సరైన నిర్వహణ  లేకపోవడంతో ఆ ట్యూబులు దెబ్బతిన్నాయి. దాంతో మళ్లీ పాత కష్టాలు మొదటికొచ్చాయి.

జియో ట్యూబ్ వాల్ పాడైపోవడంతో సముద్రం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఏటికేడు సముద్రం ముందుకు రావడంతో గ్రామ విస్తీర్ణం ఘోరంగా తగ్గిపోతోంది. రోజురోజుకూ కనుమరుగవుతున్న ఇళ్లను చూసి ఉప్పాడ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గూడు కోల్పోయిన మత్స్యకార కుటుంబాల కన్నీటి గాథలు తీరంలో నిత్య నినాదమవుతున్నాయి.

2024 ఎన్నికల ప్రచారంలో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. ఉప్పాడ తీర కోత సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీ ఇచ్చారు. ఊరిని రక్షించేందుకు పక్కా ప్రణాళికతో రక్షణ గోడ నిర్మిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నిధుల సమీకరణపై దృష్టి సారించారు. రక్షణ గోడ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.323 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను కేటాయించేందుకు అడుగులు వేస్తోంది.

నవంబర్ మాసం వస్తే చాలు వాతావరణం మారిపోతుంది. తుఫాన్లు, భారీ వర్షాల వల్ల రాకాసి అలలు ఎగసిపడతాయి. ఆలోపే రక్షణ గోడ పనులు ప్రారంభించాలని ఉప్పాడ మహిళలు కోరుతున్నారు. నేమాం నుంచి 14.5 కిలోమీటర్ల మేర ఈ రక్షణ గోడ నిర్మించాల్సి ఉంది. అయితే, ముందుగా గ్రామం ఉన్న జనావాస ప్రాంతాల వద్ద యుద్ధప్రాతిపదికన పనులు చేపడితేనే ఉప్పాడ మిగులుతుందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సముద్రం ముందుకు వస్తుంటే.. ఊరు వెనక్కి వెళ్లిపోతోంది. ఇలాగే వదిలేస్తే ఉప్పాడ ఒక చరిత్రగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు పనులు త్వరితగతిన ప్రారంభించి ఉప్పాడను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Visakhaptnam
Telugu News
AP News