• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /Pithapuram Temples: టెంపుల్ టూరిజంగా ‘పీఠికాపురం’.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్

Pithapuram Temples: టెంపుల్ టూరిజంగా ‘పీఠికాపురం’.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్

Pithapuram Temples: దక్షిణ కాశీ.. శక్తిపీఠం.. పురుహుతికా అమ్మవారి దేవాలయం! ఒకప్పుడు ఆధ్యాత్మిక విశిష్టతకు నిలయమైన కాకినాడ జిల్లా పిఠాపురం.. నేడు దేశవ్యాప్తంగా సరికొత్త వెలుగులతో మార్మోగిపోతోంది! దానికి కారణం.. అక్కడి ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్! పిఠాపురం రాజవంశీకుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న పవన్ కళ్యాణ్, ఈ నియోజకవర్గాన్ని కేవలం రాజకీయనగరంగానే కాదు.. భారతదేశంలోనే అగ్రగామి ‘టెంపుల్ టూరిజం సర్క్యూట్’గా తీర్చిదిద్దేందుకు సమరశంఖం పూరించారు. గడపలోనూ భక్తి పారవశ్యం నింపేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. పిఠాపురం ఆధ్యాత్మిక వైభవంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్.

Written ByAshok Krindinti
Published: Oct 05, 2026, 04:18 PM IST|Updated: Oct 05, 2026, 04:21 PM IST
joinshare
Pithapuram Temples: టెంపుల్ టూరిజంగా ‘పీఠికాపురం’.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్
Image Credit: Pithapuram Temples

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Fauzi Movie Leaked: ప్రభాస్ 'ఫౌజీ' సినిమా నుంచి మరో లీక్? 1.09 నిమిషాల వీడియో బయటకు..వీడియో తేడాగా ఉంది!

Fauzi Movie Leaked: ప్రభాస్ 'ఫౌజీ' సినిమా నుంచి మరో లీక్? 1.09 నిమిషాల వీడియో బయటకు..వీడియో తేడాగా ఉంది!

2

Adarsha Kutumbam Release Postpone: మూడు రోజుల్లో మూవీ రిలీజ్..అంతలోనే వెంకటేష్ సినిమా వాయిదా..ఎందుకు?

3

కాంతి వెలుగుల్లో మెదడు మర్మం.. ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్..!!

4

Pithapuram Temples: టెంపుల్ టూరిజంగా ‘పీఠికాపురం’.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్

5

బరువు తగ్గాలనుకుంటున్నారా?.. సాయంత్రం ఆకలేస్తే తినే 10 'జీరో గిల్ట్' హెల్తీ స్నాక్స్ ఇవే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pithapuram Temples: పీఠికాపురం...మహారాజుల పరిపాలనలో వెలిగిపోయిన దివ్య క్షేత్రం. పిఠాపురం సంస్థానాధీశులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆలయాల అభివృద్ధికి వందల ఎకరాల భూములు, నిధులు రాసిచ్చారు. ఇప్పుడు అదే రాజవంశపు దాతృత్వాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం కోటలో జనసేన జెండా ఎగరేసిన ఆయన, నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలోనూ భక్తి పారవశ్యం వికసించబోతోంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఏకంగా 48 నూతన రామాలయాల నిర్మాణానికి 13 కోట్ల 10 లక్షల తిరుమల తిరుపతి దేవస్థాన నిధులను పవన్ కళ్యాణ్ మంజూరు చేయించారు. పిఠాపురం, గొల్లప్రోలు, యూ.కొత్తపల్లి మండలాల్లోని బీసీ, ఎస్సీ కాలనీల్లో ఈ రామాలయాలు కొలువుదీరనున్నాయి. దీంతో వాడవాడలా రామనామ స్మరణ మార్మోగనుంది

కేవలం ఆలయాల నిర్మాణమే కాదు..సామాజిక సంక్షేమానికి ఆలయ నిధులను జోడించారు పవన్ కళ్యాణ్. మత్స్యకారులు ఎక్కువగా నివసించే  యూ.కొత్తపల్లి ప్రాంతంలో ఎకరం విస్తీర్ణంలో రూ.2 కోట్లతో టిటిడి ఆధ్వర్యంలో అత్యాధునిక కళ్యాణ మండపానికి శ్రీకారం చుట్టారు. ఈ తీరప్రాంతంలో నిర్మితమవుతున్న మొట్టమొదటి కళ్యాణమండపం ఇదే కావడంతో పేద మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ పిల్లల పెళ్లిళ్లు సగౌరవంగా చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కుక్కుటేశ్వర స్వామి ఆలయం, పదవ శక్తిపీఠం పురుహుతికా అమ్మవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతారు. ఇక్కడ పిండప్రదానాలు చేయడం ఎంతో పుణ్యఫలంగా భావిస్తారు. అయితే స్థలం సరిపోక భక్తులు ఆరుబయట అల్లాడిపోయే పరిస్థితి ఉంది. ఈ సమస్యను గమనించిన పవన్ కళ్యాణ్, 5 కోట్లు కేటాయించి నూతన భవన రంగానికి పునాది వేశారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే ఒకేసారి 500 మందికి పైగా భక్తులు పిండప్రదానాలు మరియు అన్నదానంలో పాల్గొనే సౌకర్యం కలగనుంది.

పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడిగా ఆరాధించే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి నిత్యం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఉచిత వసతి, అన్నదాన సేవలు అందించే ఈ సంస్థాన అభివృద్ధికి డిప్యూటీ సీఎం రూ.2 కోట్లు కేటాయించారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల స్వయంగా ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి మంత్రముగ్ధులయ్యారు. ఈ నిర్మాణాలు పూర్తయితే విదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా వసతి లోటు తీరనుంది.

పంచ మాధవ క్షేత్రాలలో ఒకటైన పిఠాపురంలోని కుంతీ మాధవ స్వామి ఆలయంలోని పుష్కరిణి ఆకతాయిల అడ్డాగా మారడంపై చలించిపోయిన పవన్ కళ్యాణ్, వెంటనే దానికి పునర్వైభవం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు రూ. 19.75 కోట్లతో జై గణేష్, సోమేశ్వర, సీతారామ, వేణుగోపాల, రామలింగేశ్వర, జగన్నాథ, వెంకటేశ్వర స్వామి ఆలయాలతో సహా మొత్తం 19 పురాతన ఆలయాలకు జీర్ణోద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. రాబోయే పుష్కరాల నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

అన్నవరం సత్యదేవుని దర్శనానికి, ఇటు సామర్లకోట పంచారామ క్షేత్రానికి వెళ్లే భక్తులను ఆకట్టుకునేలా "స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్" నిర్మిస్తున్నారు. దేవాదాయ, పర్యాటక శాఖల అధికారులతో రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఆలయాలకు శాశ్వత ఆర్థిక వనరులు సమకూరేలా, పిఠాపురం పేరు ప్రపంచ పటంలో నిలిచిపోయేలా పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం 'శభాష్ పవన్' అని మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా, పవన్ కళ్యాణ్ సంకల్పంతో పిఠాపురం చరిత్రలోనే ఇది ఒక సువర్ణాధ్యాయంగా నిలవబోతోంది..!

 

Add Zee News as a Preferred Source
TAGS:
Pawan Kalyan
Visakhaptnam
Telugu News