SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుపై వేగంగా అడుగులు.. కమిషన్ ముందు డిఫెన్స్ ఉద్యోగుల డిమాండ్లు, రైల్వే యూనియన్ కీలక విజ్ఞప్తి..!!

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన 8వ వేతన సంఘం చర్చలు వేగవంతం అయ్యాయి. మెడికల్, ట్రాఫిక్, మినిస్టీరియల్ , టెక్నికల్ విభాగాల్లోని పర్యవేక్షక సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించేందుకు తమకు మరో 2 రోజుల అదనపు సమయం కేటాయించాలని ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ 8వ వేతన సంఘం చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ను కోరింది.

Written By Bhoomi
Published: Nov 18, 2026, 18:27 IST | Updated: Nov 18, 2026, 18:29 IST
Image Credit: 8th Pay Commission Update
Join

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన 8వ వేతన సంఘం చర్చలు వేగవంతం అయ్యాయి. మెడికల్, ట్రాఫిక్, మినిస్టీరియల్ , టెక్నికల్ విభాగాల్లోని పర్యవేక్షక సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించేందుకు తమకు మరో 2 రోజుల అదనపు సమయం కేటాయించాలని ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ 8వ వేతన సంఘం చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ను కోరింది. గతంలో అక్టోబర్ 30వ తేదీన 8 పే కమిషన్ తో ఈ రైల్వే యూనియన్ దాదాపు 2గంటల పాటు సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే తక్కువ సమయం ఉండటం వల్ల ఈ భేటీలో పలు కీలక డిమాండ్లపై చర్చించలేదు. దీంతో తమకు మరో 2 రోజుల అదనపు సమయం ఇవ్వాలని యూనియన్ కమిషన్ కు విజ్నప్తి చేసింది.

కాగా ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేడు 8వ వేతన సంఘంతో సమావేశం అయ్యింది. ఈ భేటీలో ప్రధానంగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు, బీమా, ఇతర ఉద్యోగి సంబంధిత అంశాలపై కమిషన్ ద్రుష్టికి తీసుకెళ్లింది. అయితే అక్టోబర్ 30వ తేదీన జరిగిన 2గంటల సమావేశం నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీన ఏఐఆర్ఎఫ్ తన వివరణాత్మక వినతిపత్రాన్ని కమిషన్ కు సమర్పించింది. అయితే తక్కువ సమయం వల్ల అన్ని ఉద్యోగుల కేడర్లను ఆ చర్చల్లో చేర్చలేకపోయారు. ప్రస్తుతం తాము కోరిన అదనపు రెండు రోజుల సమయంలో ఈ విభాగాల సిబ్బంది ఆందోళనలను కమిషన్ వినాలని యూనియన్ కోరుతోంది.  

వైద్య విభాగంలోని నాన్-గెజిటెడ్ మెడికల్ సిబ్బందితోపాటు డ్రాయింగ్ అండ్ డిజైన్, సీఎం‌టీ, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్లు, ఐటీ ( కేడర్‌తో కూడిన సాంకేతిక విభాగాల పర్యవేక్షక సిబ్బంది డిమాండ్లతోపాటు.. ట్రాఫిక్ కంట్రోలర్లు (రైలు మేనేజర్లు మినహా), స్టెనోగ్రాఫర్లు, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్లు, వర్క్ స్టడీ ఇన్‌స్పెక్టర్లు,  అకౌంట్స్ సిబ్బంది..కోల్‌కతా మెట్రో రైల్వే ఉద్యోగులు, ఆర్‌డిఎస్‌ఓ, అధికార భాషా విభాగం ఉద్యోగుల డిమాండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ సమావేశానికి ఎందుకంత ప్రాధాన్యత? 
ఈ విభాగాలన్నీ రైల్వే ఉద్యోగులలో అత్యంత కీలకమైన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని.. వీరికి విభిన్నమైన పని, సేవా సంబంధిత సమస్యలు ఉన్నాయని AIRF స్పష్టం చేస్తోంది. అందువల్ల 8వ వేతన సంఘం ముందు వీరి సమస్యలకు సరైన ప్రాతినిధ్యం లభించడం ద్వారా, వారి న్యాయమైన డిమాండ్లకు తగిన గుర్తింపు లభిస్తుందని యూనియన్ భావిస్తోంది. ఈ మేరకు AIRF తన లేఖలో..పైన పేర్కొన్న కేటగిరీలపై సవివరమైన చర్చలు జరపడానికి కనీసం మరో రెండు రోజుల సమయాన్ని కేటాయించాలని మేము అభ్యర్థిస్తున్నాము. గౌరవనీయ ఛైర్‌పర్సన్,  కమిషన్‌కు అనుకూలమైన ఏ తేదీ, సమయంలోనైనా ఈ చర్చలను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది.

డీఏ సవరణపై స్పష్టత:
జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల 8వ వేతన సంఘం ప్యానెల్ అక్టోబర్ 8న బెంగళూరులో తన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం అక్టోబర్ 22, 23 తేదీలలో ముంబైలో కీలక చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘం ఏర్పడినప్పటి నుండి గత 11 నెలలుగా ఈ ప్యానెల్ ఢిల్లీ, లడఖ్, పశ్చిమ బెంగాల్,  పుదుచ్చేరితో సహా దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన సమావేశాలను నిర్వహించింది. పలు  వేతన సంఘాల సూచనల  ఆధారంగా ఆమోదించిన ఫార్ములా ప్రకారం కరువు భత్యాన్ని సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కార్మికుల సమాఖ్యఇటీవల వ్యయ విభాగానికి  తెలియజేసింది.

Also Read:

 

బర్డ్‌ఫ్లూ ముప్పుకు చెక్.. తొలి స్వదేశీ H5N1 టీకాను అభివృద్ధి చేసిన భారత్..!!

 

గుడ్ న్యూస్ చెప్పబోతున్న సమంత.. డెలివరీకి ముందు భర్తతో కలిసి ప్రత్యేక పూజలు, ఫొటోలు చూశారా?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES