SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు..అలాగే అక్టోబరు 31న కూడా మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే?

Bank Holiday Tomorrow: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. దేశంలోని కొన్ని బ్యాంకుల్లో రేపు సెలవు ఉండనుంది. కర్వా చౌత్ సందర్భంగా అక్టోబరు 29న కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అక్టోబరు 29న బ్యాంకులు యథావిధిగా తెరుచుకుంటాయి.

Written By Harish Darla
Published: Oct 28, 2026, 01:56 PM IST | Updated: Oct 28, 2026, 01:58 PM IST
Join

Bank Holiday Tomorrow: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) క్యాలెండర్ ప్రకారం 2026 అక్టోబర్ 29, గురువారం నాడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. కర్వా చౌత్ పండుగను పురస్కరించుకుని అక్కడ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

ఈ రోజున ఆ రాష్ట్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు అలాగే యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకుల శాఖలన్నీ మూతపడతాయి.

ఇతర రాష్ట్రాల్లో బ్యాంకుల పనివేళలు..
కర్వా చౌత్ ఉన్నప్పటికీ, హిమాచల్ ప్రదేశ్ మినహా దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు సాధారణ పనివేళల ప్రకారం పనిచేస్తాయి. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, బీహార్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాలలో అక్టోబర్ 29న బ్యాంకులు యథావిధిగా తెరిచి ఉంటాయి. అయితే అక్టోబర్ 31 శనివారం నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటు..
బ్యాంకు శాఖలు మూసివేసి ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా లభిస్తాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపిఐ (UPI) ద్వారా నగదు బదిలీలు చేసుకోవచ్చు. అలాగే ఏటీఎమ్ (ATM) ద్వారా నగదు ఉపసంహరణ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే, సెలవు రోజున చెక్కుల క్లియరెన్స్, నేరుగా బ్యాంకు శాఖల్లో నిర్వహించే అత్యవసర పనులు మాత్రం నిలిచిపోతాయి. కాబట్టి నేరుగా బ్యాంక్‌కు వెళ్లాలనుకునే వారు ముందుగా ఈ సెలవు వివరాలను గమనించుకోవడం అవసరం.

కర్వా చౌత్ పండుగ విశేషాలు.. 
కర్వా చౌత్ అనేది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వివాహిత మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రధాన పండుగ. ఈ పవిత్ర దినాన మహిళలు తమ భర్తల దీర్ఘాయువు, సంతోషకరమైన వైవాహిక జీవితం, మంచి ఆరోగ్యం కోసం సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు నిరాహారంగా కఠినమైన ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు.

ఉదయాన్నే 'సర్గీ' తీసుకున్న అనంతరం రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం వేళ కర్వా మాత, పరమశివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, చంద్రుడిని పూజిస్తారు. చంద్రోదయం కాగానే చంద్రుడికి నైవేద్యాలు సమర్పించి, తమ భర్త ముఖాన్ని చూసి ఆయన చేతుల మీదుగా నీరు తాగి ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ పండుగతో వీరవతి పౌరాణిక కథ ముడిపడి ఉంది.

సోదరుల మోసం వల్ల చంద్రుడిని చూశాననుకుని ఉపవాసం విరమించిన వీరవతి భర్త కష్టాల్లో పడగా, ఆమె నిశ్చల భక్తి ప్రార్థనలే తిరిగి ఆయనను కాపాడాయని, ఇది ఈ ఉపవాస మహత్యానికి ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES