SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఉద్యోగులకు దీపావళి కానుక.. క్యాష్, వోచర్, గిఫ్ట్ కార్డ్.. వీటిలో ఏది నిజంగా లాభదాయకం?

Gift Cards vs Vouchers vs Cash: ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా దీపావళి పండగ సమయం దగ్గరపడింది. ఉద్యోగులకు బహుమతులు.. బోనస్ లు ఇచ్చేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి.

Written By Bhoomi
Published: Oct 26, 2026, 09:34 AM IST | Updated: Oct 26, 2026, 09:37 AM IST
Image Credit: Gift Cards vs Vouchers vs Cash
Join

Gift Cards vs Vouchers vs Cash: ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా దీపావళి పండగ సమయం దగ్గరపడింది. ఉద్యోగులకు బహుమతులు.. బోనస్ లు ఇచ్చేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో నగదు, బ్రాండ్ వోచర్లు, మల్టీ బ్రాండ్ గిఫ్ట్ కార్డుల రూపంలో బహుమతులు ఇవ్వడం సాధారణమే.  చూసేందుకు వీటన్నింటి విలువ ఒకే విధంగా కనిపించినా.. వాటి వాడకం, సౌలభ్యం, పన్ను నిబంధనల పరంగా వాటి వాస్తవ ప్రయోజనాల్లో భారీగా తేడాలు ఉంటాయి. ఉద్యోగులకు ఏది ఎక్కువ విలువ అందిస్తుందన్న దానిపై ఇప్పుడు చర్చ జోరుగా నడుస్తోంది. 

నగదు: సంపూర్ణ స్వేచ్ఛ..కానీ పన్ను భారం:
బహుమతిగా నగదు అందుకోవడం ఉద్యోగులకు సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. వారు ఆ డబ్బును తమకు నచ్చినట్లుగా ఖర్చు చేసుకోవచ్చు.  రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు లేదా పొదుపు చేసుకోవచ్చు. అయితే.. ఇందులో ఒక పెద్ద ప్రతికూలత ఉంది. కంపెనీలు ఇచ్చే నగదు బహుమతులు సాధారణంగా వారి జీతంలో భాగంగా పరిగణిస్తారు. దీనివల్ల.. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం వారు దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే, అందుకున్న మొత్తం విలువ కంటే నికర ప్రయోజనం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. రూ. 10,000 నగదు బహుమతి అందుకుంటే, ఉద్యోగి మిగిలిన మొత్తాన్ని పన్ను లేకుండా పొందుతాడు.

బ్రాండ్ వోచర్లు: అదనపు తగ్గింపు.. కానీ పరిమితులు:
కొన్ని కంపెనీలు పెద్దమొత్తంలో కొనుగోలు చేసి.. నిర్దిష్ట బ్రాండ్‌ల వోచర్లను తగ్గింపు ధరకు పొంది ఉద్యోగులకు ఇస్తాయి. దీనివల్ల ఆ బ్రాండ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు ఉద్యోగులకు కొద్దిగా ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. అయితే, ఈ బహుమతి వినియోగం ఆ నిర్దిష్ట బ్రాండ్‌కు మాత్రమే పరిమితం అవుతుంది. ఒకవేళ ఉద్యోగికి ఆ బ్రాండ్ నుండి కొనుగోలు చేయాలనే ఆసక్తి లేకపోతే.. ఆ వోచర్ విలువ లేకుండా పోతుంది. అంతేకాకుండా.. ఈ వోచర్లకు గడువు తేదీ ఉంటుంది. ఆ సమయంలోగా వోచర్‌ను ఉపయోగించకపోతే.. దాని పూర్తి విలువను కోల్పోతారు. కొన్నిసార్లు, వోచర్ మొత్తాన్ని ఒకేసారి ఉపయోగించలేకపోతే, మిగిలిన బ్యాలెన్స్ కోల్పోతారు. దీనిని 'బ్రేకేజ్' అంటారు.

మల్టీ-బ్రాండ్ గిఫ్ట్ కార్డ్‌లు: సౌకర్యం- పన్ను ప్రయోజనాల కలయిక:

మల్టీ-బ్రాండ్ గిఫ్ట్ కార్డ్‌లు లేదా ఫ్లెక్సిబుల్ రివార్డ్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఇటీవల ఒక ఆచరణాత్మక పరిష్కారంగా మారాయి. ఇవి ఉద్యోగులకు అనేక సౌకర్యాలను అందిస్తాయి. ఈ కార్డ్‌లు కిరాణా, షాపింగ్, రెస్టారెంట్లు, వినోదం వంటి బహుళ కేటగిరీలలో ఎక్కడైనా ఖర్చు చేయడానికి వారిని అనుమతిస్తాయి. సింగిల్-బ్రాండ్ వోచర్‌లతో పోలిస్తే, బ్యాలెన్స్ అయిపోయే అవకాశం చాలా తక్కువ.

గిఫ్ట్ కార్డ్‌లకు పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే నగదు రహిత బహుమతులు.. వోచర్‌లపై సంవత్సరానికి రూ. 15,000 వరకు పన్ను మినహాయింపును అందిస్తాయి. ఈ పరిమితికి చేరుకుంటే, ఉద్యోగి గిఫ్ట్ కార్డ్‌పై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ పన్ను మినహాయింపు నగదు బహుమతులకు వర్తించదు. అందువల్ల, ఉద్యోగులు బహుమతిని స్వీకరించే ముందు తమ కంపెనీ నిబంధనలు.. షరతులను తెలుసుకోవాలి. అంతిమంగా, ఉద్యోగికి నిజంగా ఉపయోగపడి, నిజమైన విలువను అందించే బహుమతులే ముఖ్యమైనవని కంపెనీలు గుర్తిస్తే, అది ఇరుపక్షాలకూ శ్రేయస్కరం.

Also Read: 

డీఎస్సీ 2024 టీచర్ల నిరీక్షణకు తెర.. ప్రొబేషన్ ఉత్తర్వులు

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES