• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /E100 ఫ్యూయల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పాత, కొత్త కార్లపై ఎఫెక్ట్ ఉంటుందా..? అసలు నిజాలు ఇవే..!

E100 ఫ్యూయల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పాత, కొత్త కార్లపై ఎఫెక్ట్ ఉంటుందా..? అసలు నిజాలు ఇవే..!

E100 Impact on Old Cars: దేశంలో 100 శాతం ఇథనాల్‌తో నడిచే E100 ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల తయారీ, విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయంతో 15 ఏళ్లు, 10 ఏళ్ల పాత కార్లతో పాటు ఇటీవలే కొన్న సరికొత్త కార్ల పరిస్థితి ఏమిటి..? సాధారణ పెట్రోల్ కార్లలో E100 పోస్తే ఏం జరుగుతుంది..? కార్ల యజమానుల్లో అనుమానాలు ఏంటి..?

Written ByAshok Krindinti
Published: Oct 26, 2026, 06:39 PM IST|Updated: Oct 26, 2026, 06:41 PM IST
joinshare
E100 ఫ్యూయల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పాత, కొత్త కార్లపై ఎఫెక్ట్ ఉంటుందా..? అసలు నిజాలు ఇవే..!
Image Credit: E100 flex fuel approval India (Source: AI)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Snakes Video: కోపంతో పెనవేసుకుని ఫైటింగ్‌కు దిగిన రెండు పాములు.. వీడియో వైరల్..

Snakes Video: కోపంతో పెనవేసుకుని ఫైటింగ్‌కు దిగిన రెండు పాములు.. వీడియో వైరల్..

2

Vijay Deverakonda: రష్మికకు అండగా విజయ్ దేవరకొండ.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!

3

ట్రోల్స్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన విజయ్,రష్మిక దంపతులు..

4

AP School Holiday: అర్నాబ్ తుపాన్ ప్రభావం.. ఏపీలోని ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు.!.

5

E100 ఫ్యూయల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పాత, కొత్త కార్లపై ఎఫెక్ట్ ఉంటుందా..? అసలు నిజాలు ఇవే..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

E100 Impact on Old Cars: దేశీయ ఆటోమొబైల్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని కార్లలో 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్ వాడకం దిశగా ముందుడుగు వేసింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సోమవారం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌కు మార్పులను నోటిఫై చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై దేశంలో పూర్తిస్థాయి ఇథనాల్ ఆధారిత వాహనాల తయారీ, రిజిస్ట్రేషన్లకు చట్టబద్ధమైన మార్గం సుగమమైంది. ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన 'E20' ఇంధనాన్ని అమల్లోకి తీసుకురాగా.. ఇప్పుడు ఏకంగా 100 శాతం ఇథనాల్‌తో తీసే 'E100' ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

ప్రభుత్వం నిర్ణయం తరువాత దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది కార్ల యజమానుల్లో సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తాము వాడుతున్న కార్లలో ఈ E100 ఉపయోగించవచ్చా..? దీనివల్ల ఇంజిన్ పాడవుతుందా..? ఇక నుంచి పెట్రోల్ బంకుల్లో పాత పెట్రోల్ దొరకదా..? వంటి ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే వాహనదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చెబుతున్నారు.

వాహనదారుల్లో తలెత్తుతున్న ఈ అనుమానాలపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. E20కి మించిన ఇంధనం లేదా E100 స్వచ్ఛమైన ఇథనాల్ అనేది కేవలం ఆ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసి, ధ్రువీకరించిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు మాత్రమే ఉద్దేశించినదని తెలిపారు. సాధారణ వాహనాలకు ఇది ఏమాత్రం వర్తించదని.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న E20 కార్లు లేదా సాధారణ పెట్రోల్‌తో నడిచే కార్లలో E85 లేదా E100 ఇంధనాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించేందుకు సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఉన్న కార్లలో E100 ఉపయోగించకూడదని అన్నారు.  

E100 ఫ్యూయల్ అంటే ఏమిటి..?

చెరకు, మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల వ్యర్థాల నుంచి తయారుచేసే సహజ ఇంధనాన్నే ఇథనాల్ అంటారు. ప్రస్తుతం మన దేశంలోని బంకుల్లో సాధారణంగా లభిస్తున్న పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నారు. దీనిని E20 అని పిలుస్తున్నారు. అదే విధంగా E85 అంటే 85 శాతం ఇథనాల్ ఉండగా.. E100 అంటే దాదాపు 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌తో కూడిన ఇంధనం. ఇందులో శిలాజ పెట్రోల్ ఆనవాళ్లు దాదాపు ఉండవు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పాత కార్లతోపాటు ఇటీవల E20 ఫ్యూయల్‌కు అనుగుణంగా తయారు చేసిన కార్లలోనూ E100 ఫ్యూయల్ వాడేందుకు అవకాశం ఉండదు. 15 ఏళ్ల క్రితం తయారు చేసిన పాత కార్ల ఇంజిన్లు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, రబ్బరు గొట్టాలు, ఇంధన ట్యాంకులు కేవలం 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌కు అనుగుణంగా మాత్రమే డిజైన్ చేశారు. పొరపాటున కూడా ఇలాంటి వింటేజ్ లేదా పాత కార్లలో E100 వంటి అధిక ఇథనాల్ ఇంధనాన్ని పోస్తే.. ఇథనాల్ ప్రభావానికి ఇంధన గొట్టాలు కరిగిపోవడం, లీకేజీలు రావడం, ఇంజిన్ విడిభాగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

అయితే గడచిన పదేళ్ల క్రితం నాటి కార్ల ఇంజిన్లు కాస్త ఆధునికంగా ఉన్నా.. అవి కూడా గరిష్టంగా 5 నుంచి 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని మాత్రమే తట్టుకోగలవు. ఈ మోడళ్లలో కూడా నేరుగా E100 ఫ్యూయల్ పోయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఒకవేళ వీటిలో అధిక ఇథనాల్ ఇంధనం వాడితే కార్ మైలేజ్ దారుణంగా పడిపోవడంతో పాటు.. ఇంజిన్ అంతర్గత భాగాల్లో తుప్పు పట్టే అవకాశం ఉంది. ఇక ఇటీవల కాలంలో లేదా 2026లో మార్కెట్లోకి వచ్చిన చాలా కార్లు ఇప్పటికే E20 నిబంధనలకు అనుగుణంగా తయారవుతున్నాయి. అయితే E20 కార్లు కూడా నేరుగా E100 ఇంధనానికి పనికిరావు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా నిబంధనల ప్రకారం సాధారణ పెట్రోల్ కార్లలో E100 పోయాలని ఎక్కడా చెప్పలేదు. ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేకంగా E100 సర్టిఫికేషన్‌తో డిజైన్ చేసి విడుదల చేసే ప్రత్యేకమైన 'ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల్లో' మాత్రమే ఈ 100 శాతం ఇథనాల్‌ను వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ పెట్రోల్ వాహనాలు యథావిధిగా సాధారణ బంకుల్లో పెట్రోల్‌ను నింపుకోవచ్చు.

ప్రభుత్వ లక్ష్యం ఇదే..

ప్రస్తుతం ముడి చమురు అవసరాల కోసం భారత్ అత్యధికంగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో ప్రతి ఏటా లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోంది. ఈ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశీయంగా తయారయ్యే ఇథనాల్ వినియోగాన్ని కేంద్రం క్రమంగా పెంచుతోంది. 2025 నాటికే 20 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని అందుకున్న భారత్.. దేశంలో ఇథనాల్ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. E100 వాహనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులకు భారీగా ఆర్థిక లబ్ధి చేకూరడంతో పాటు ముడి చమురు దిగుమతులు భారీగా తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News