Two days schools declares holiday in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్ణబ్' తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసు కొస్తుంది. ఈ క్రమంలో తీవ్ర తుపాను, రేపు అతి తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఏపీలో అర్నబ్ తుపాన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీర ప్రాంతాల్లోని జిల్లాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.తుపాన్ నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరక్కుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ప్రజలకు, రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు ముందు జాగ్రత్తగా రెండు రోజుల పాటు సెలవుల్ని ప్రకటిస్తు ఆదేశాలు జారీ చేశారు. అర్నాబ్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ అంబేద్కర్, కృష్ణ, విజయ నగరం, కాకినాడ, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు.
అదే విధంగా... కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతే కాకుండా.. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లురీ, పార్వతిపురం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే గోదావరిలో బోట్ల నిలిపితేతకు ఆదేశాలు జారీ చేశారు. పాపికొండల విహరయాత్రకు బ్రేక్ పడ్డాయి. 16 టూరిస్టు బోట్ల రాకపోకలకు బంద్ చేయాలని నిర్ణయించారు.
అర్నాబ్ తుపాన్.. బుధవారం ఉదయం బాపట్ల - విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాన్ తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 140 కి.మీ వేగంతో బలమైన గాలులు వీయడానికి చాన్స్ ఉందని అధికారులు ప్రకటించారు. తుపాను ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి అత్యంత భారీ నుంచి, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.