SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

EPF Instant Withdrawal: యూపీఐ నుంచి పీఎఫ్ విత్‌డ్రా ఆప్షన్ రెడీ? ఒకేసారి ఏకంగా 75 శాతం డబ్బులు డ్రా చేయోచ్చు!

EPF Instant UPI Withdrawal: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ చందాదారుల కోసం విప్లవాత్మక సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇకపై పీఎఫ్ ఖాతాదారులు రోజులు తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా 'యూపీఐ' (UPI) ద్వారా నిమిషాల్లోనే తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు సులభంగా ఉపసంహరించుకోవచ్చు. ప్రముఖ బ్యాంకులతో కలిసి ఇప్పటికే దీనిపై ప్రయోగాత్మక పరిశీలనలు (ట్రయల్ రన్) ప్రారంభం కాగా, ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ నూతన సదుపాయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

Written By Harish Darla
Published: Oct 08, 2026, 07:32 AM IST | Updated: Oct 08, 2026, 07:40 AM IST
Join

EPF Instant UPI Withdrawal: చందాదారుల అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఈపీఎఫ్ఓ సరికొత్త డిజిటల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే యూఏఎన్ (UAN) పోర్టల్‌ ద్వారా క్లెయిమ్ నమోదు చేసి, అధికారులు పరిశీలించి అనుమతించే వరకు రోజులకు రోజులు సమయం పట్టేది. అయితే, నూతన విధానంలో UAN పోర్టల్ నేరుగా సబ్‌స్క్రైబర్ల యూపీఐ ఐడీతో అనుసంధానం కానుంది. దీనివల్ల మధ్యలో సమయం వృథా కాకుండా నేరుగా చందాదారుల బ్యాంక్ ఖాతాల్లోకి విత్‌డ్రా సొమ్ము అత్యంత వేగంగా జమ అవుతుంది.

ప్రత్యేక యాప్, భీమ్ (BHIM) అనుసంధానం..
చందాదారులు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ ఒక ప్రత్యేక నూతన యాప్‌ను కూడా రూపొందిస్తోంది. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వపు 'భీమ్' (BHIM) యాప్‌తో పాటు ఇతర ప్రముఖ యూపీఐ యాప్‌లతో అనుసంధానమై పనిచేస్తుంది. దీని ద్వారా యూజర్లు తమ మొబైల్ ఫోన్ల నుంచే నేరుగా విత్‌డ్రా అభ్యర్థనలను పంపుకోవచ్చు. ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు డిజిటల్ రూపంలో మహత్తర ప్రయోజనం చేకూరుతుంది.

విత్‌డ్రా పరిమితులు, అర్హతలు..
యూపీఐ విధానంలో గరిష్టంగా 75 శాతం నిధులను మాత్రమే డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇల్లు లేదా స్థలం కొనుగోలు, వైద్య అత్యవసరాలు వంటి ప్రత్యేక కారణాల నిమిత్తం ఈ 75 శాతం సొమ్మును పొందే అర్హత ఉంటుంది.

రిటైర్మెంట్ భద్రత, పన్ను రహిత వడ్డీ.. 
అత్యవసరాల కోసం ఎంత డ్రా చేసుకున్నా, ఖాతాలోని మొత్తం నిధిలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ నిల్వ ఉండటం తప్పనిసరి. ఈ మిగిలిన 25 శాతం సొమ్ము చందాదారుడి పీఎఫ్ ఖాతాలోనే భద్రంగా ఉండి, దానిపై ప్రభుత్వం అందించే పన్ను రహిత వడ్డీ యథావిధిగా జమ అవుతూ ఉంటుంది.

ఇది చందాదారుల భవిష్యత్తు రిటైర్మెంట్ అవసరాలకు ఆర్థిక భద్రతను అందిస్తూనే, తక్షణ అత్యవసరాలకు అవసరమైన నగదును వేగంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వద్ద దాదాపు రూ. 26 లక్షల కోట్ల భారీ కార్పస్ నిధి ఉండగా, ప్రతినెల క్రమం తప్పకుండా చందా చెల్లించే యాక్టివ్ చందాదారులు సుమారు 7.5 కోట్లుగా ఉన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES