SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. మినిమమ్ బ్యాలెన్స్ 25శాతం నుండి 10శాతానికి తగ్గింపు..!!

EPFO Minimum Balance Rule: పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణల సమయంలో అకౌంట్లో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్ ను 25శాతం నుంచి 10శాతానికి తగ్గిస్తూ ఈపీఎఫ్ఓ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులు తమ పీఎఫ్ నిల్వలో 90శాతం వరకు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కలిగిందని చెప్పాలి.

Written By Bhoomi
Published: Nov 19, 2026, 15:57 IST | Updated: Nov 19, 2026, 15:59 IST
Image Credit: EPFO Withdrawal Big Update:
Join

EPFO Minimum Balance Rule: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ  గుడ్ న్యూస్ అందించింది. పీఎఫ్ అకౌంట్లో తప్పనిసరిగా ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్ ను ప్రస్తుతం ఉన్న 25శాతం నుంచి 10శాతానికి తగ్గిస్తూ ఈపీఎఫ్ఓ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఖాతాదారులు తమ రిటైర్మెంట్ పొదుపు నిధులను అవసరాలకు అనుగుణంగా మరింత ఎక్కువగా వినియోగించుకునే ఛాన్స్ లభిస్తుంది.

దేశంలోని ఏడు కోట్లకు పైగా ఉన్న వేతన జీవులు ఈపీఎఫ్ఓ పరిధిలో సభ్యులుగా ఉన్నారు. అత్యవసర ఆర్థిక అవసరాలు, వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం వంటి సందర్భాల్లో ఉద్యోగులు తమ  పీఎఫ్ అకౌంట్ నుంచి పార్షియల్ విత్ డ్రాయల్స్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్ విత్ డ్రా రూల్స్ ప్రకారం.. ఖాతాదారులు పాక్షిక విత్ డ్రా చేసేటప్పుడు తమ అర్హత కలిగిన పీఎఫ్ నిల్వలో కనీసం 25శాతాన్ని అకౌంట్లోనే ఉంచాల్సి వచ్చేది. అయితే ఈ రూల్ కారణంగా ఎమర్జెన్సీ సమయంలో తమ సొంత డబ్బును పూర్తి స్థాయిలో తీసుకోలేకపోతున్నామని ఉద్యోగులు భావించారు.

అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పాక్షిక విత్ డ్రాయల్ సమయంలో పీఎఫ్ అకౌంట్లో 25శాతం నిల్వను తప్పనిసరిగా ఉంచాలి. తాజాగా ఈ లిమిట్ ను 10శాతానికి తగ్గిస్తూ ఈపీఎఫ్ఓ బోర్డు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో పరిస్ధితి మారింది. వర్తించే విత్ డ్రాయల్స్  రూల్స్ కు లోబడి ఖాతాదారులు ఇక నుంచి తమ అర్హత కలిగిన పీఎఫ్ పొదుపు మొత్తంలో 90శాతం వరకు విత్ డ్రా చేసుకునే వీలు ఉంటుంది. ఆపత్కర సమయంలో అప్పుల బారిన పడకుండా తమ పొదుపు సొమ్మునే వాడుకునేందుకు ఈ మార్పు వేతన జీవులకు ఎంతో తోడ్పడుతుంది.

సవరించిన ఈపీఎఫ్ఓ విత్ డ్రాయల్ చట్రం కింద ఈపీఎఫ్ఓ గతంలో 25శాతం నిల్వ రూల్ తీసుకువచ్చింది. ఉద్యోగులు సర్వీసులో ఉండగానే..తమ పీఎఫ్ అకౌంట్ ను పూర్తిగా ఖాళీ చేయకుండా రిటైర్మెంట్ సమయానికి కొంత నిధిని భద్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశ్యంతో దీన్ని రూపొందించారు. అకౌంట్లో మిగిలి ఉండే నిల్వపై ఈపీఎఫ్ఓ అందించే వార్షిక వడ్డీ ప్రయోజనాలు సభ్యులకు నిరంతరం అందుతూ ఉండాలన్నది ఈపీఎఫ్ఓ ప్రధాన ఉద్దేశ్యం. అయితే రిటైర్మెంట్ భద్రతతోపాటు ఉద్యోగుల తక్షణ ఆర్ధిక అవసరాలను కూడా పరిగణలోనికి తీసుకున్న ఈపీఎఫ్ఓ బోర్డు, కనీస నిల్వ పరిమితిని 10శాతానికి సడలించింది. దీంతో అకౌంట్లో కనీసం 10శాతం నిల్వ ఉండి వడ్డీ బెనిఫిట్స్ పొందుతూనే.. ఆపత్కర సమయంలో 90శాతం వరకు నిధులను విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఖాతాదారులకు దక్కిందని చెప్పాలి. 

Also Read: 

 

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES