బంగారం కొంటున్నారా? మార్కెట్లో కొత్త రేనియం గోల్డ్ మోసం.. అప్రమత్తం లేకుంటే అసలుకే ఎసరు..!!
Gold: బంగారం కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే. బంగారం కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఈ వార్త ఒకసారి చదవాల్సిందే. ఎందుకంటే సాధారణంగా చాలా మందిలో ఒక అనుమానం ఉంటుంది. బంగారంలో కల్తీ ఉంటుందా?
Gold: బంగారం కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ వార్త మీకోసమే. బంగారం కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఈ వార్త ఒకసారి చదవాల్సిందే. ఎందుకంటే సాధారణంగా చాలా మందిలో ఒక అనుమానం ఉంటుంది. బంగారంలో కల్తీ ఉంటుందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు నిపుణులు. బంగారంలో కల్తీ చేసినప్పుడు దాని నాణ్యత దెబ్బతింటుంది. అప్పుడు క్యారెట్ టెస్ట్ చేస్తే 22 క్యారెట్ల బంగారం ఇస్తున్నారా లేదా 18 క్యారెట్ల బంగారం ఇస్తున్నారా లేదా 16 క్యారెట్ ఆభరనాలు ఇస్తున్నారా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. తాజాగా ఒక కొత్త మోసం వెలుగుచూసింది. ఇందులో బంగారం కరగపెట్టి అందులో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రేనియం పొడిని కలిపేస్తున్నారు. ఈ పొడి బంగారంలో కలిపితే.. సాధారణ క్యారెట్ క్వాలిటీ చెక్ చేసే యంత్రాలు కూడా గుర్తించలేకపోతున్నాయి. దీంతో గోల్డ్ జ్యువెల్లరీ కొనుగోలు చేసేవారు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అసలు ఈ రేనియం పొడి మోసం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
అసలు రేనియం అంటే ఏంటి?
రేనియం అనేది ఒక మిశ్రమ లోహం. రాగి, మాలిబ్డినం గనుల నుంచి బై ప్రొడక్టుగా ఇది లభిస్తుంది. మాలిబ్డెనైట్ ఖనిజాన్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే వెలువడే ఆవిరిని నుంచి సేకరించి రసాయన ప్రక్రియల ద్వారా స్వచ్చమైన రేనియం పొడిగా మారుస్తారు. సాధారణంగా బంగారం సాంద్రత అనేది 19.32g/cm³..అలాగే రేనియం సాంద్రత 21.02g/cm³ అంటే రెండింటి సాంద్రత దాదాపు సమానంగా ఉంటుంది. అలాగే బరువు, పరిణామంలో కూడా తేడా అస్సలు ఉండదు. ఫలితంగా బంగారం, రేనియం కలిసినప్పుడు క్యారెట్ యంత్రాల్లో ఎక్స్ రే కిరణాల రీడింగ్స్ జరిపినప్పుడు ఒకే విధంగా కనిపిస్తాయి. ఫలితంగా బంగారం 22 క్యారెట్ గోల్డ్ వలే కనిపిస్తుంది. దీంతో ఎక్స్ ఆర్ఎఫ్ క్యారెట్ మీటర్లు మోసపోయే అవకాశం ఉంటుంది.
బంగారం కంటే రేనియం ద్రవీభవన ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా, సుమారు 3180°C వద్ద ఉంటుంది. దీనివల్ల బంగారాన్ని కరిగించినప్పుడు కూడా అందులో కలిపిన రేనియం పూర్తిగా కరగకుండా సూక్ష్మ కణాల రూపంలో లోపలే ఉండిపోతుంది. అందుకే సాధారణంగా చేసే గీటురాయి పరీక్షలు, యాసిడ్ టెస్టులలో కూడా ఈ కల్తీ సులభంగా బయటపడదు.
రేనియం ధర ఎలా ఉంది?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల క్రిటికల్ మినరల్స్ మిషన్ కింద రేనియంపై దిగుమతి సుంకాన్ని మినహాయించింది. ప్రస్తుతం బంగారంలో కల్తీ చేసేందుకు వాడే గోల్డెన్ రేనియం పొడి అధికారిక ధర గ్రాముకు రూ. 4,811 ఉండగా, కొందరు అక్రమ ఏజెంట్లు, స్మగ్లర్లు బ్లాక్ మార్కెట్లో దీనిని రూ. 5,000 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా సిండికేట్ హస్తం ఉందా?
ఈ తరహా కల్తీ మూలాలు చైనాలో కనిపిస్తున్నాయి. 2025 ఆగస్టులో చైనాలోని జెజియాంగ్ పోలీసులు పాత బంగారం పేరుతో రేనియం కలిపిన నకిలీ బంగారాన్ని అమ్మి 8 లక్షల యువాన్లు కాజేసిన ఓ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం భారత్లో వెలుగుచూస్తున్న ఈ కల్తీ దందా వెనుక కూడా చైనా కేంద్రంగా పనిచేస్తున్న సిండికేట్ హస్తం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రేనియం కల్తీని ఎలా గుర్తించవచ్చు?
సాధారణ బంగారం షాపుల్లో అందుబాటులో ఉండే క్యారెట్ మీటర్లు, యాసిడ్ పరీక్షలతో రేనియం కల్తీని పట్టుకోవడం అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిని గుర్తించాలంటే కేవలం అల్ట్రాసోనిక్ టెస్ట్, ఫైర్ అస్సే (Fire Assay) వంటి ప్రత్యేక ల్యాబొరేటరీ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 'ఇండక్టివ్లీ కపుల్డ్ ప్లాస్మా ఆప్టికల్ ఎమిషన్ స్పెక్ట్రోమెట్రీ' (ICP-OES) లేదా 'మాస్ స్పెక్ట్రోమెట్రీ' (ICP-MS) పరీక్షల ద్వారానే బంగారంలో రేనియం కల్తీని అత్యంత కచ్చితంగా నిర్ధారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: