Flipkart Sale Thomson TV: దసరా బంపర్ ఆఫర్.. 4K QLED స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 ధరకే!
Flipkart Sale Thomson TV Offer: పండుగల సీజన్ పురస్కరించుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్ (Thomson) భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీల లైనప్‌ను విడుదల చేసింది. 40 అంగుళాల నుండి 65 అంగుళాల వరకు విభిన్న పరిమాణాలలో అందుబాటులోకి వచ్చిన ఈ టీవీల ప్రారంభ ధర రూ.11,999 గా ఉంది.
Flipkart Sale Thomson TV Offer: ప్రముఖ స్మార్ట్ టీవీ తయారీ సంస్థ థామ్సన్ ప్రవేశపెట్టిన ఈ నూతన లైనప్‌లో వినియోగదారుల బడ్జెట్‌కు తగినట్లుగా వేర్వేరు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పండుగల సీజన్ పురస్కరించుకుని థామ్సన్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీల లైనప్‌ను విడుదల చేసింది.
40 అంగుళాల నుండి 65 అంగుళాల వరకు విభిన్న పరిమాణాలలో అందుబాటులోకి వచ్చిన ఈ టీవీల ప్రారంభ ధర రూ.11,999 గా ఉంది. ఇందులో Mini-QD 4K, 4K QLED, Full HD స్మార్ట్ టీవీ మోడళ్లు ఉన్నాయి. ఈ టీవీలన్నీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2026 (Flipkart Big Billion Sale 2026) సమయంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
వివిధ రకాల పరిమాణాలు ఉన్న స్మార్ట్ టీవీల ధరలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
40 అంగుళాల Full HD స్మార్ట్ టీవీ: రూ.11,999
43 అంగుళాల Full HD టీవీ: రూ.13,999
55 అంగుళాల Mini - QD 4K టీవీ: రూ.34,999
65 అంగుళాల 4K QLED (JioTele OS) టీవీ: రూ.42,999
55 ఇంచుల Mini - QD 4K టీవీ ఫీచర్లు
ఈ 55 అంగుళాల టీవీలో 1.1 బిలియన్ రంగుల సపోర్ట్ ఇచ్చే డిస్‌ప్లేను అమర్చారు. ఇది 550 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, HDR10+, Dolby Vision ఫీచర్లతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ ఇస్తుంది. ఆడియో విభాగంలో Dolby Audio మద్దతుతో పాటు నాలుగు స్పీకర్లు కలిగిన 80W స్టీరియో సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. ఈ టీవీ Google TV OS ఆధారంగా పనిచేస్తూ, Google Assistant వాయిస్ కమాండ్లు, Chromecast, AirPlay ఫీచర్లను అందిస్తుంది.
65 అంగుళాల 4K QLED (JioTele OS) టీవీ ప్రత్యేకతలు..
65 అంగుళాల ప్రీమియం మోడల్ బెజెల్ - లెస్, AirSlim డిజైన్ కలిగిన 4K QLED డిస్‌ప్లే తో అందుబాటులోకి వస్తుంది. ఇది 1.1 బిలియన్ కలర్స్, 450 నిట్స్ బ్రైట్‌నెస్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇది JioTele OS తో పనిచేస్తుంది, దీని ద్వారా 300కు పైగా ఉచిత లైవ్ టీవీ ఛానళ్లు, 300 కంటే ఎక్కువ JioGames లభిస్తాయి. దీనిలో స్పోర్ట్స్ మోడ్, 48W స్పీకర్లు, డ్యూయల్ - బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.0, వాయిస్ రిమోట్, 3 HDMI, 2 USB పోర్టులు ఉన్నాయి
బడ్జెట్ Full HD టీవీలు..
40, 43 అంగుళాల Full HD టీవీలలో A+ గ్రేడ్ ప్యానెల్, 300 నిట్స్ బ్రైట్‌నెస్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ అందించారు. రెండింటిలోనూ 36W స్టీరియో సౌండ్, HDMI, USB, VGA, AV పోర్టులు, చైల్డ్ లాక్ సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ Flipkart Big Billion Sale 2026 లో లభించనున్నాయి.