• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Pawan Kalyan: చింత చెట్టు కింద గిరిపుత్రులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వరాలు

Pawan Kalyan: చింత చెట్టు కింద గిరిపుత్రులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వరాలు

Deputy CM Pawan Kalyan Resolves Tribals Problems: గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ క్రమంలో మరోసారి గిరిజన ప్రాంతాన్ని సందర్శించారు. అడవితల్లి బాట 2 0 కార్యక్రమంలో ఓ గూడెనికి వెళ్లి గిరిజనుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులపై వరాలు ప్రకటించారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 11, 2026, 03:41 PM IST|Updated: Oct 11, 2026, 03:43 PM IST
joinshare
Pawan Kalyan: చింత చెట్టు కింద గిరిపుత్రులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వరాలు
Image Credit: Pawan Kalyan Adavithalli Bata 2 0

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
శరీరంలో ఓమేగా-3 లోపించిందా? రోజువారీ డైట్‌లో చేపలకు బదులు ఇవి ట్రై చేయండి!

శరీరంలో ఓమేగా-3 లోపించిందా? రోజువారీ డైట్‌లో చేపలకు బదులు ఇవి ట్రై చేయండి!

2

జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి!

3

RRB NTPC Graduate Recruitment: రైల్వేలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. 3,548 పోస్టులు భర్తీ..రూ.30,000 జీతం!

4

Pawan Kalyan: చింత చెట్టు కింద గిరిపుత్రులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వరాలు

5

Basar Temple: బాసర క్షేత్రంలో ఘనంగా శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Adavithalli Bata 2 0: గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై మరింత దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మరోసారి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్యం ప్రాంతాల్లో తిరిగి గిరిజనులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. చింతచెట్టు కింద మాటామంతి పెట్టిన పవన్‌ కల్యాణ్‌ అనంతరం గిరిజనులు అడిగిన అన్నీంటిని చేసేస్తానని వరాలు కురిపించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

‘అడవితల్లిబాట 2.0’ కార్యక్రమాన్ని పోలవరం జిల్లా పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గం వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాకోట గిరిశిఖర గ్రామంలో శ్రీకారం చుట్టారు. కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను కలిపేలా రూ.2.29 కోట్ల వ్యయంతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం రాకోట గ్రామంలో చింతచెట్టు కింద రచ్చబండ కార్యక్రమంలో గిరిపుత్రులతో ‘మాటా-మంతి’ చేశారు.

రాకోటపై వరాలు
సుమారు 350 మంది జనాభా కలిగిన రాకోట గ్రామాన్ని సందర్శించి, గిరిజనుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చింత చెట్టు కింద కూర్చుని వారితో మమేకమయ్యారు. గిరిజనులు ప్రస్తావించిన సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కారాలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల, ఆరోగ్య కేంద్రం, ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రకటించారు. రాకోట గ్రా ఎంపీపీ పాఠశాల శిథిలావస్థలో ఉండడంతో పునరుద్ధరణకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ.15 లక్షలు ఇచ్చారు. రాకోట హనుమాన్ ఆలయం రేకుల షెడ్డులో కొనసాగుతుండడంతో ఆలయ అభివృద్ధికి రూ.20 లక్షలు కేటాయించారు.

‘మాటా-మంతి’ కార్యక్రమంలో రాకోట పరిసర ప్రాంతాలైన వేములకొండ, సువర్లవాడ, డబ్బావలస, తిరుగటిరాళ్లు, కాకవాడ, చిలకవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విన్నవించుకున్నారు. ప్రతి గ్రామానికి అంగన్‌వాడీ కేంద్రంతో కూడిన మండల పరిషత్ పాఠశాల, విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు చేస్తూ వాటికి దాదాపు రూ.5 కోట్లు కేటాయించారు. గిరిజనులు తమ సమస్యలను స్వయంగా ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.

రాకోట గ్రామంలో వెదురు బొంగులతో గృహోపకరణాలు తయారు చేస్తున్న కొమ్మిరెడ్డి కుటుంబంతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సెర్ప్ ఆధ్వర్యంలో వెదురు ఉత్పత్తుల ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. వెదురు ఉత్పత్తులకు మరింత విలువ జోడించి గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభించేలా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. కాకవాడ గ్రామంలో పీఎం కృషి సించాయి యోజన 2.0 కింద వాటర్‌షెడ్ అభివృద్ధి పరికరాల పంపిణీని ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.68 కోట్ల వ్యయంతో 34 వేల మంది అర్హులైన రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే కార్యక్రమంలో భాగంగా స్థానిక గిరిజన రైతులకు పరికరాలను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పంపిణీ చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Pawan Kalyan
Andhra Pradesh
AP News
Telugu News