Nara Lokesh in Jayammu Nishchayyamu Raa Season 2: విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’. తొలి సీజన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ 2 ప్రారంభమైంది. ఈ సీజన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సీజన్‌లో తొలి ఎపిసోడ్ సాయి పల్లవితో సాగిన ఇంటర్వ్యూకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, థమన్ కాంబోలో సెకండ్ ఎపిసోడ్ వచ్చింది. ఇందులో నటుడు సునీల్ స్పెషల్ గెస్ట్‌గా కనిపించి సర్ఫ్రైజ్ చేశారు. తాజాగా మూడో ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అతిథిగా పాల్గొనడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.. చూస్తుంటే ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా ప్రేక్షకులకు కోరుకునే అన్ని అంశాలు ఈ సీజన్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌లో నారా లోకేశ్ పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు..
స్కూల్ డేస్‌లో అల్లరి.. ఎక్కువగా పనిష్‌మెంట్ నాకే!
ఇంటర్వ్యూలో భాగంగా స్కూల్ రోజుల్లో తాను చేసిన అల్లరి పనులను నారా లోకేశ్ సరదాగా గుర్తుచేసుకున్నారు. టీచర్ల నుంచి ఎక్కువ పనిష్‌మెంట్ అందుకున్నది తానేనని నవ్వుతూ చెప్పడం విశేషం. దీంతో నిజంగానే అంత అల్లరి చేసేవారా? అని జగపతిబాబు ప్రశ్నించగా.. తన మామయ్య నందమూరి బాలకృష్ణతో పోటీ పడాల్సి వచ్చేదని లోకేశ్ ఛమత్కరించడం విశేషం.
The firebrand meets the firebrand! 🔥 Get ready for a first-ever, unfiltered and iconic interaction with @naralokesh in a special Diwali episode! ✨ Premieres on 6th November on Telugu Zee 5. #Zeetelugu premieres on 8th November at 7:30pm #JayammuNishchayammuRaaSeason2 #JNRSeason2OnZee5 #NaraLokesh
— Zee 5 South (@Zee5South) October 26, 2026
పెళ్లి సమయంలో ఆసక్తికర ఘటనను గుర్తుచేసుకున్న లోకేశ్!
తన పెళ్లి సమయంలో జరిగిన ఓ సరదా సంఘటనను నారా లోకేశ్ ఓ సారి నెమరువేసుకున్నారు. ఓ రోజు తనను ‘అల్లుడుగారు’ అని పిలవడంతో.. ఏదో ఫిట్టింగ్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారేమోనని వెంటనే అనుకున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.
బాలయ్యకు కూడా ఒకరంటే భయమేనా?
సినిమాల్లో తన పవర్‌ఫుల్ పర్ఫామెన్స్‌తో మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే నందమూరి బాలకృష్ణ గురించి నారా లోకేశ్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. బాలయ్య తన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తికి భయపడతారని చెప్పారు. ఈ విషయాన్ని సరదాగా ప్రస్తావించారు.
బాలయ్య ఐకానిక్ డైలాగ్‌తో అదరగొట్టిన లోకేశ్ ప్రోమో చివర్లో నారా లోకేశ్.. బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను చెప్పి అలరించడం విశేషం. “ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు!” అంటూ బాలకృష్ణ స్టైల్‌లో డైలాగ్ చెప్పడంతో ఈ ఎపిసోడ్ ఎపుడెపుడు చూద్దామా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో బాలా మావయ్య హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ లో నారా లోకేష్ పాల్గొని సందడి చేశారు. ఇపుడు జగపతిబాబు హోస్ట్ చేస్తోన్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2లో పాల్గొనడం విశేషం. జయమ్ము నిశ్చయమ్మురా సీజన్2లో నారా లోకేశ్ ఇంటర్వ్యూ నవంబర్ 6న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 8 సాయంత్రం 7గంటల 30 నిమిషాలకు జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ కానుంది.